Malli Pelli OTT: ‘మళ్ళీ పెళ్లి’ : అక్కడ కట్ చేసిన రొమాంటిక్ సీన్లు ఇక్కడ చూడొచ్చట!

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ ల సహజీవనం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ మధ్య కాలంలో బోల్డ్ సినిమాలు తీస్తున్న ఎం.ఎస్.రాజు ఈ నరేష్ – పవిత్ర ల హాఫ్ బయోపిక్ ను తెరకెక్కించారు. ‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

మే 26న ఈ మూవీ విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి కానీ.. థియేటర్లలో టికెట్లు తెగడానికి అవి సాయపడలేదు. నరేష్.. పవిత్ర జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలను ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు. అది కూడా నరేష్ కోణంలో మాత్రమే..! మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య వనిత విజయ్ కుమార్ పై సెటైరికల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రాన్ని (Malli Pelli) విడుదల కాకుండా చేయాలనీ ఆమె హైకోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘మళ్ళీ పెళ్లి’ లో కొంచెం బోల్డ్ సీన్లు ఎక్కువగానే ఉంటాయట. కానీ సెన్సార్ వాళ్ళు ఆ సన్నివేశాలు కట్ చేసినట్టు తెలుస్తుంది. థియేటర్లలో ఈ సన్నివేశాలు లేవు. కానీ జూన్ 23 న ‘మళ్ళీ పెళ్లి’ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీలోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ‘మళ్ళీ పెళ్లి’ స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక్కడ రిలీజ్ అయ్యేది కొత్త వెర్షన్ అని తెలుస్తుంది. సెన్సార్ వారు కట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు ఇక్కడ చూడొచ్చట. ఈ మధ్య ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో ఇదొక కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పాలి. ‘విడుదలై-1’ విషయంలో కూడా ఇదే జరిగింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus