ఈ నెల 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ఎంట్రీ సాధించిందీ సినిమా. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ‘సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్’గా పేర్కొనడం విశేషం. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందంటున్నాడు దర్శకుడు విజయ్.

ఇక ట్రైలర్ తో విపరీతమైన అటెన్షన్ తెచ్చుకున్న “వైఫ్ ఆఫ్ రామ్” సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీం ను ప్రశంసించారు. మంచు లక్ష్మి కెరీర్ లో ఇది ఓ మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఇప్పటికే సినిమా చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల 20న విడుదల కాబోతోంది ‘వైఫ్ ఆఫ్ రామ్’.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus