వనిత విజయ్ కుమార్ ఆ విషయంలో అందుకే తగ్గిందట..!

ఈ మధ్యనే ‘ హీరోయిన్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వనిత మూడో పెళ్లిని వ్యతిరేకిస్తూ.. ఆమె పై పలువురు సినీ సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.’వనిత.. తన ఇద్దరు కూతుర్లు పెద్దవాళ్ళు అయ్యారన్న విషయాన్ని పక్కన పెట్టి మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి? వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టైములో సిగ్గు లేకుండా మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి?’ అంటూ కస్తూరి వంటి నటీమణులు విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా వనిత పెళ్లి చేసుకున్న పీటర్ కు కూడా ఇది రెండో పెళ్లి. అందులోనూ అతను మొదటి భార్య ఎలిజబెత్ కు విడాకులు ఇవ్వకుండానే వనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పై కూడా వారు విమర్శిస్తున్నారు. అయితే.. ‘నేను మూడు పెళ్లిల్లు చేసుకోవడం అనేది పూర్తిగా నా పర్సనల్ విషయం. దానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి?’ అంటూ వనిత కూడా ఆమెను విమర్శిస్తున్న వారికి ఘాటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా..

‘తనని మనో వేదనకు గురిచేస్తున్నారని’ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో వారు సూర్య దేవి అనే మహిళ ను బుధవారం నాడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గురువారం రోజున ఆమెను నటి కస్తూరి బెయిల్ పై విడుదల చేసిందట. ఇందుకు వనిత కూడా అంగీకరించినట్టు సమాచారం. సూర్య దేవి పిల్లలను కూడా ధృష్టిలో పెట్టుకునే బెయిల్ కు అభ్యంతరం చెప్పడం లేదు అని వనిత తెలిపింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus