కన్నడ డైరెక్టర్లు యష్ పాన్ ఇండియా మార్కెట్ ను మ్యాచ్ చేయలేకపోతున్నారా..?

  • February 13, 2021 / 04:11 PM IST

ప్రశాంత్ నీల్ మన యష్ ను పాన్ ఇండియన్ స్టార్ గా మార్చేశాడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 తో ఇతను దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ ఏడాది విడుదల కాబోతున్న కె.జి.ఎఫ్2 కూడా అదే స్థాయిలో హిట్ అయితే.. ఇతని మార్కెట్ రెండింతలు పెరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. యష్ కు పాన్ ఇండియా మార్కెట్ ను మెయింటైన్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేది కన్నడ మీడియా వర్గాల సమాచారం.

ఎందుకంటే అక్కడి సినిమాలు అన్నీ రీమేక్లే ఉంటాయి. ఒక్క ప్రశాంత్ నీల్ ను పక్కన పెడితే మిగిలిన వారంతా పక్క ఇండస్ట్రీలోని కథలనే అటు ఇటు మార్చి తీస్తుంటారు. దీంతో యష్ పాన్ ఇండియా మార్కెట్ ను వారు మ్యాచ్ చేయలేకపోతున్నారు. అందుకే అతను కూడా టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా అతనితో సినిమాలు చేస్తే మార్కెట్ ను పెంచుకోవచ్చు అని భావిస్తున్నారు.

ఇప్పటికే పూరి జగన్నాథ్ .. యష్ తో సినిమా ఓకె చేయించుకున్నాడు అని తెలుస్తుంది. అంతేకాదు హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లు కూడా యష్ కు కథలు వినిపించారు అని సమాచారం. ఇవి యష్ కు కూడా నచ్చాయని తెలుస్తుంది. అంతేకాకుండా రాజమౌళి తో సినిమా చెయ్యాలని కూడా యష్ తెగ ఆశపడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus