బిగ్ బాస్ హౌస్ లో దీపావళి ఎపిసోడ్ కోసం రంగం సిద్ధం అయ్యింది. ఆదివారం గ్రాండ్ గా ఈ ఎపిసోడ్ ని ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నారు. దసరా కంటే కూడా గొప్పగా ఉండేలా చూస్తున్నారు. ఈనేపథ్యంలో పండగ రోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈవారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో ఫిమేల్ కంటెస్టెంట్ రతిక మాత్రమే ఉంది. రాజమాతలు అందరూ ఏకాభిప్రాయంతో రతికని నామినేట్ చేశారు. దీంతో రతిక నామినేషన్స్ లోకి వచ్చింది. కానీ, ఈసారి మేల్ కంటెస్టెంట్ ని పంపించేలాగానే కనిపిస్తోంది బిగ్ బాస్ టీమ్.
ఎందుకంటే, గత కొన్ని వారాలుగా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. వరుసగా ఏడు వారాలు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత మేల్ కంటెస్టెంట్ సందీప్ – తేజ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 10వ వారం కూడా అలాగే చేయాలని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇలా అయితే యావర్ – గౌతమ్ – భోలే ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లో ఉంటారు. ఈవారం నామినేషన్స్ లో యావర్ సెల్ఫ్ నామినేట్ చేస్కున్నాడు. దీంతో ఈవారం యావర్ కి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది బాగా తగ్గిపోయింది.
అంతేకాదు, శివాజీకి ఆల్ మోస్ట్ సగం ఓటింగ్ అనేది జరిగిపోయింది. అందుకే, యావర్ కి బాగా తగ్గింది. ఇక గౌతమ్ కి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఈవారం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. రతిక ఫిమేల్ కోటాల సేఫ్ అయినా కూడా యావర్ ఇంకా భోలో షవాలి ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉంటారు. వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూస్తే భోలే – యావర్ ఇద్దరికీ ఒకేలా ఓటింగ్ అనేది జరుగుతోంది. ఇద్దరూ కూడా 12 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది కైవసం చేసుకున్నారు.
నిజానికి దీపావళి ఎపిసోడ్ కాబట్టి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ ఎలిమినేషన్ లేకపోతే ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు. లేదంటే మాత్రం దీపావళికి ఖచ్చితంగా ఎలిమినేషన్ లో బాంబ్ పేల్చబోతున్నాడు బిగ్ బాస్. సెల్ఫ్ నామినేషన్ చేస్కున్నందుకు బిగ్ బాస్ టీమ్ యావర్ ని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యం లేదు. మరి ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అనేది ఎలా ఉంటుంది ? ఈవారం (Bigg Boss 7 Telugu) ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది బిగ్ బాస్ లవర్స్ లో టెన్షన్ ని పెంచుతోంది. అదీ మేటర్.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!