సరిగ్గా ఆరు నెలల క్రితం విడుదలైన “ఏడు చేపల కథ” టీజర్ క్రియేట్ చేసిన రచ్చను ఫిలిమ్ నగర్ జనాలు ఇంకా మర్చిపోలేదు. నగ్నత్వం, శృంగారం మోతాదు మించిన ఆ టీజర్ అప్పుడు బాగా రచ్చ చేసింది. సరిగ్గా అదే సమయానికి ప్రభుత్వం కూడా పోర్న్ బ్యాన్ చేయడంతో ఆ టీజర్ కి కొద్ది రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకొంది. ఇప్పుడు ఆ సినిమా సెకండ్ టీజర్ ను విడుదల చేశారు. మొదటి టీజరే దారుణంగా ఉందనుకొంటే.. సెకండ్ టీజర్ ఇంకాస్త శ్రుతిమించింది. మొదటి టీజర్ లో రొమాన్స్ మాత్రమే చూపించిన దర్శకనిర్మాతలు సెకండ్ టీజర్ లో ఏకంగా అమ్మాయిల ఆర్గాస్మ్ ఎపిసోడ్స్ ను కూడా జొప్పించి విడుదల చేశారు.
ఒక గంట క్రితం విడుదలైన ఆ టీజర్ కాసేపట్లో సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో సంచలనం సృష్టించడం ఖాయం. నిన్నమొన్నటివరకూ అమెరికన్ సాఫ్ట్ పోర్న్ మూవీస్ చూసి సంతోషించిన యువత మాత్రం ఇప్పుడు “ఏడు చేపల కథ” చూసి ఇది ఇండియన్ సాఫ్ట్ పోర్న్ అని సొంగ కారుస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక సెన్సార్ కత్తెరకు ఎన్ని సీన్లు కట్ అయ్యి సినిమాలో ఏం మిగులుతుందో తెలియదు కానీ.. టీజర్, ట్రైలర్ వరకూ మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నాయి.