`ఎంత‌ప‌ని చేశావే శిరీషా` ఫ‌స్ట్ లుక్, టీజర్ విడుద‌ల‌

మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా ఓవ‌ర్సీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెట్ వ‌ర్క్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఎంత‌ప‌ని చేశావే శిరీషా`. శివ‌రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్లూరి బాల‌కృష్ణ‌, రామ్ ప్ర‌సాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కాన‌ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బ్యానర్ లోగో, ఫ‌స్ట్ లుక్, టీజర్ విడుదల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో బుధ‌వారం జ‌రిగింది. బ్యాన‌ర్ లోగోను తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు పి.రామ్మోహ‌న్ విడుద‌ల చేశారు. టైటిల్ లోగోను నిర్మాతలు పట్లూరి బాలకృష్ణ, దిలీప్ కుమార్ విడుదల చేశారు. టీజర్ ను ప్రముఖ దర్శక నిర్మాత అనిల్ సుంక‌ర ఆవిష్క‌రించారు.

ప్రముఖ దర్శక నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ “బాల‌కృష్ణ, నేను క్లాస్ మేట్స్. బెంచ్ మేట్స్. అయితే బ్యాక్ బెంచ్ మాత్రం కాదు. కానీ ఈ సినిమా బ్యాక్‌బెంచ్ సినిమా హీరో మ‌హ‌త్ రాఘ‌వేంద్ర న‌టించారు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమా రావ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాకు స‌పోర్ట్ చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాను“ అని తెలిపారు.

తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్ష్యుడు పి.రామ్మోహ‌న్ మాట్లాడుతూ “ఈ సంస్థ బ్యాన‌ర్ లోగో చాలా బావుంది. మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలి. ఈ సంస్థ మీద ద‌శాబ్దాల త‌ర‌బ‌డి నిర్మాతలు సినిమాలు చేస్తూనే ఉండాలి“ అని చెప్పారు.

చిత్ర నిర్మాత పట్లూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ “తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత అనిల్ సుంక‌రగారే నాకు ఇన్ స్పిరేషన్. ఆయ‌న మార్గంలోనే వెళ్లి తీసిన ఈ సినిమా హిట్ కావాలి. మా యూనిట్ స‌భ్యులంద‌రూ కృషి చేసి ఈ సినిమాను చాలా బాగా చేశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. దర్శకుడు సినిమా బాగా తెరకెక్కించారు. సినిమా అంతా కామెడితో సాగుతుంది“ అని చెప్పారు.

నిర్మాత దిలీప్ కుమార్ మాట్లాడుతూ “ డైలాగులు కూడా కంటెంట్ మీద బేస్ అయి ఉంటాయి. మ‌హ‌త్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. హీరో, హీరోయిన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మంచి లొకేష‌న్లలో చిత్రీక‌రించాం“ అని తెలిపారు.

సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ “మ‌హ‌త్ ఈ సినిమాతో చాలా బాగా ఫ్రెండ్ అయ్యారు. ఈ చిత్రాన్ని చూస్తుంటే మంచి స‌న్నిహితుల మ‌ధ్య ఆనందంగా గ‌డిపిన‌ట్టు ఉంటుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అని చెప్పారు.

పున‌ర్న‌వి మాట్లాడుతూ “క‌థ బాగా న‌చ్చింది. క‌థ విన్నంత సేపూ ఎగ్జ‌యిట్ అయ్యాను. షూటింగ్ కూడా పూర్త‌యింది. సినిమా ఎంత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుందో టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది“ అని తెలిపారు.

సుద‌ర్శ‌న్‌, అన్న‌పూర్ణ‌, సూర్య‌, అనితా చౌద‌రి, సుడిగాలి సుధీర్‌, ప్రియ‌, జోగి బ్ర‌ద‌ర్స్ అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌లు: విజ‌య్‌.కె.మ‌డ‌ల‌, రామ్‌ల‌క్ష్మ‌ణ్ మునిగంటి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: దిలీప్ బొలుగోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: శ్యామ్ బోనాలా,సంగీతం: పూర్ణ‌చంద‌ర్ భైరి, కెమెరా: శ్యామ్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌: స‌త్య గిడుటూరి, ఆర్ట్: రామ్ కుమార్, కెమెరా: ర‌మేష్ ఎర్రోళ్ల‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus