ఇక మౌనంగా ఉండలేను.. సింగర్ పోస్ట్!

  • August 7, 2021 / 07:26 PM IST

ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడంటూ అతడి భార్య షాలిని గృహహింస ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి ఇతర మహిళలతో ఉన్నాయని.. దాని గురించి ప్రశ్నిస్తే తనను శారీకరంగా హింసించాడని ఆరోపించింది. తాజాగా ఈ ఆరోపణలపై హనీసింగ్ స్పందించాడు.

తన భార్య షాలిని తల్వార్ తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. అవన్నీ వింటుంటే బాధగా ఉంటుందని.. ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానని.. ఆమె చెప్పేవన్నీ చాలా అసహ్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. గతంలో తనపై వ్యతిరేకత వచ్చినప్పుడు ఎప్పుడూ స్పందించలేదని.. కానీ ఈసారి మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనిపించిందని అన్నారు. తన తల్లితండ్రులు, చెల్లెలి మీద నీచమైన ఆరోపణలు చేస్తుందని.. ఇవి తమ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని హనీసింగ్ చెప్పుకొచ్చారు.

తను పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. ఈ జర్నీలో ఎంతోమంది కళాకారులను, సంగీతకారులతో కలిసి పని చేశానని.. తన భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసని అన్నారు. షూటింగ్ లకు, ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు షాలినిని కూడా వెంట తీసుకొని వెళ్లేవాడినని చెప్పారు. ఆమె చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు.. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus