టాలీవుడ్ హీరోలు నటించిన కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేయగా వాటికి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. అక్కడి లోకల్ ఛానల్స్ లో కూడా ఆ సినిమాలు భారీగా వ్యూవర్ షిప్ ను నమోదు చేసి.. టి.ఆర్.పి రేటింగ్లు రాబడుతున్నాయి.అందులో ఎక్కువ శాతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ, నితిన్, రామ్ పోతినేని, అఖిల్,నిఖిల్, విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలు ఉన్నాయి. దీంతో వీళ్ళ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది.
వీళ్ళ సినిమాలకి పెట్టే బడ్జెట్లో 30 శాతం అలాగే రికవరీ అవుతుంది. ఈ క్రమంలో ఈ హీరోలకి పాన్ ఇండియా మోజు ఎక్కువైంది. యూట్యూబ్లో రిలీజ్ చేసే డబ్బింగ్ సినిమాలకే ఆ రేంజ్లో డబ్బులు వస్తున్నప్పుడు.. హిందీలో జెండా పాతెయ్యలి అని అంతా ఫిక్స్ అయ్యారు. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2 ‘ సైతం అక్కడ భారీగా కలెక్ట్ చేసింది.
అందువల్ల మిడ్ రేంజ్ హీరోలకి హిందీలో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలి అనే ఆశ ఎక్కువైంది. మొత్తానికి ఈ లిస్ట్ లో ఉన్న హీరోల్లో కొంతమంది పాన్ ఇండియా సినిమాలు చేశారు. నిఖిల్ ‘స్పై’ తో నార్త్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక్క టికెట్ కూడా తెగలేదు. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ ‘ఛత్రపతి’ తో నార్త్ లో అడుగుపెట్టాడు. ఆ సినిమాకి వాల్ పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు అనే విమర్శలు ఎదురయ్యాయి.
ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రంతో రవితేజ నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అతనికి కలిసిరాలేదు. గతంలో ‘ఖిలాడి’ తో ట్రై చేశాడు.. దాని రిజల్ట్ కొంతలో కొంత పర్వాలేదు కానీ.. భారీ కలెక్షన్స్ రాబట్టింది అయితే లేదు. కాబట్టి..’వాపు చూసి బలుపు అనుకోకూడదు’ అని మిగిలిన హీరోలైనా గమనించాల్సి ఉంది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!