పంజాబ్‌లో సోనూ సూద్ ‘ఫతే’ చిత్రం షూటింగ్ ప్రారంభం

ZEE స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా వైభవ్ మిశ్రా దర్శకత్వంలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫతే’. ఈ చిత్రాన్ని పంజాబ్‌లోని పవిత్ర నగరమైన అమృత్‌సర్‌లో గ్రాండ్ గా ప్రారంభం జరుపుకుంది. చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో ఎథికల్ హ్యాకర్లచే శిక్షణ పొందడానికి సోనూ సూద్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వివిధ వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు

అనంతరం హీరో సోనూ సూద్ మాట్లాడుతూ…సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వాస్తవికతకు దగ్గర ఉండేలా ఈ చిత్రం రూపుదిద్దుకొనుంది . లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమా తీయడం జరిగిందని అన్నారు.”

హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. దర్శకుడు వైభవ్ మిశ్రా చెప్పిన కథ నచ్చడంతో తనిచ్చిన ఈ స్క్రిప్టు చదివాను. చదివినప్పటి నుండి, ఇలాంటి మంచి చిత్రంలో నటించాలనే ఇంట్రెస్ట్ కలిగింది. మేము చేస్తున్న ఈ ఫతే సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

షరీక్ పటేల్; CBO, ZEE స్టూడియోస్ వారు మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సోనూ ఒకరు.. అలాంటి వ్యక్తితో ‘ఫతే’ సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకేక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేకకాధారణ పొందుతుంది.ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియకన్స్ పని చేయనున్నారు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొని ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus