తొలి సినిమాతోనే ఆకట్టుకున్న 10 మంది డైరెక్టర్ల లిస్ట్..!

2022 లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా కొరటాల శివ వంటి బడా డైరెక్టర్ పెద్ద డిజాస్టర్ ఇచ్చి షాకిచ్చాడు. మారుతి లాంటి డైరెక్టర్ కూడా కంగుతిన్నాడు.అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ కు చాలా మంది దర్శకులు పరిచయమయ్యారు. కొంతమంది సక్సెస్ అయ్యారు.. మరి కొంతమంది దుకాణం సర్దేసారు. అయితే సక్సెస్ అయినవాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఊహించని విధంగా కొంతమంది కొత్త దర్శకులు ప్రేక్షకులను అలరించారు. వాళ్ళ ప్రతిభతో మంచి మార్కులు వేయించుకున్నారు. ఆల్రెడీ రెండో సినిమాల కోసం కొత్త కథలు కూడా రాసేసుకుంటున్నారు. సరే ఇంతకీ 2022 లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విమల్ కృష్ణ :

‘డిజె టిల్లు’ మూవీతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు విమల్. రొమాన్స్, క్రైమ్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

2) విద్యాసాగర్ చింతా :

విశ్వక్ సేన్ తో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాడు. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.

3) గోపీనాథ్ రెడ్డి :

‘సమ్మతమే’ అనే చిత్రంతో ఇతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే ఇతను ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి మార్కులు వేయించుకున్నాడు.

4) మల్లిడి వశిష్ట్ :

కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ వంటి హై బడ్జెట్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా పెట్టిన బడ్జెట్ ను రికవర్ చేయడమే కాకుండా మంచి ప్రాఫిట్స్ ను కూడా అందించింది.

5) శ్రీ కార్తీక్ :

‘ఒకే ఒక జీవితం’ శర్వానంద్ కు కంబ్యాక్ మూవీ. తొలి చిత్రమే అయినప్పటికీ ఈ కుర్ర డైరెక్టర్ చాలా బాగా తీశాడు.

6) లక్ష్మణ్ కె కృష్ణ :

‘స్వాతి ముత్యం’ అనే చిత్రంతో ఇతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

7) అశ్వంత్ మారిముత్తు :

విశ్వక్ సేన్ తో ‘ఓరి దేవుడా’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా బాగానే ఆడింది.

8) హరి,హరీష్ :

సమంతతో ‘యశోద’ అనే హై బడ్జెట్ మూవీని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు ఈ దర్శకులు.

9) రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల :

సుడిగాలి సుధీర్ తో ‘గాలోడు’ అనే మాస్ మూవీని తెరకెక్కించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.

10) సాయి కిరణ్ :

హర్రర్ సినిమాలు కూడా కామెడీతో నిండిపోవడం వల్ల ఆ సినిమాల పై జనాలకు చులకన భావన కలిగింది. అయితే చాలా కాలం తర్వాత ‘మసూద’ తో మళ్ళీ భయపెట్టి ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాడు సాయి కిరణ్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus