అల్లు అర్జున్ కు ఉన్న ఈ 10 కార్ల ధరలు తెలిస్తే షాక్ అవుతారు!

అల్లు అర్జున్… ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సన్ ఆఫ్ అల్లు అరవింద్ అని, గ్రాండ్ సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్.. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. మొన్నటి వరకు అతను సౌత్ లోనే ఫేమస్..కానీ ‘పుష్ప’ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు . ఇప్పుడు పుష్ప 2 ని విదేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో రష్యా, చైనా వంటి దేశాల్లో ఈ మూవీని ఏక కాలంలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ ను అభిమానులు స్టైలిష్ స్టార్ అని, ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అల్లు అర్జున్… డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, లైఫ్ స్టైల్ కానీ చాలా స్టైలిష్ గా ఉంటుంది.

అందరి హీరోల మాదిరే అల్లు అర్జున్ కు కూడా కార్లు అంటే మహా ఇష్టం. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనుగోలు చేసేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ వద్ద ఉన్న కార్లను పరిశీలిస్తే…

1) మెర్సిడెస్ జి ఎల్ ఇ 350 డి: అల్లు అర్జున్ కు ఉన్న ఈ బ్లాక్ కార్ ధర రూ.75 లక్షలు

2) బి ఎం డబ్ల్యూ : అల్లు అర్జున్ కొనుగోలు చేసిన మరో బ్లాక్ కార్ ఇది. దీని ధర రూ.92.2 లక్షలు.

3) రేంజ్ రోవర్ వోగ్ : 2019 లో అల్లు అర్జున్ ఈ కారును కొనుగోలు చేశాడు. దీని ధర రూ.2 కోట్లు

4) వోల్వో ఎక్స్ సి 90 టి వి ఎక్సెలెన్స్ : అల్లు అర్జున్ కలిగి ఉన్న ఈ వైట్ కలర్ కార్ రూ.1.31 కోట్లు

5) హమ్మర్ హెచ్ 2 : అల్లు అర్జున్ ఈ కారును రూ.75 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు.

6) జాగ్వర్ ఎక్స్ జె ఎల్ : అల్లు అర్జున్ ఈ కారును రూ.1.57 కోట్లకు కొనుగోలు చేశాడు

7) వెనిటీ వేన్ : ఇక అల్లు అర్జున్ కు ఉన్న ఈ వేనిటీ వేన్ ను రూ.7 కోట్లు పెట్టి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు.

8) మహీంద్రా వారి బ్లాక్ కలర్ కార్ కూడా అల్లు అర్జున్ రూ.45 లక్షలతో కొనుగోలు చేశాడు.

9) అంతేకాదు తన కెరీర్ ప్రారంభంలో తీసుకున్న మారుతి సుజుకి కార్ ఇప్పటికీ అల్లు అర్జున్ కార్ గ్యారేజ్ లో ఉందట.

10) ప్రస్తుతం బన్నీ లంబోర్గినీని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ , తారక్ ల వద్ద ఇలాంటి కార్లు ఉన్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus