ఈ ఏడాది ‘నెట్ ఫ్లిక్స్’ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన సినిమాల లిస్ట్

లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీల పైనే ఆధారపడుతూ వచ్చారు. 2022 లో జనాలు థియేటర్లకు వెళ్ళడం తగ్గించారు అంటే అందుకు ప్రధాన కారణం ఓటీటీలే అని చెప్పాలి. ఏదైతేనేం.. ఓటీటీల వల్ల చిన్న సినిమాలకు లైఫ్ దొరికింది. ఇదివరకటిలా సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ కష్టపడనవసరం లేదు. హ్యాపీగా పెట్టిన బడ్జెట్ పై కొంత పెర్సెంటేజ్ ఎక్కువ వేసి డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు.

ఒకవేళ మంచి రేటు దక్కకపోతే హ్యాపీగా వ్యూయర్ షిప్ బేసిస్ మీద రిలీజ్ చేసుకోవచ్చు. దాని వల్ల ఇన్ని నెలలకు అని అమౌంట్ వస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ కాకపోయినా ఓటీటీలో మంచి ఫలితాలను అందుకున్నవి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ ఉన్నారు. కాబట్టి ఈ ప్లాట్ ఫామ్లో కనుక సినిమా రిలీజ్ అయితే.. ఎక్కువ మంది చూస్తుంటారు. అలా సినిమాలకు మంచి పేరు లభిస్తూ ఉంటుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. 2022 లో నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి :

1) సూర్యవంశీ :

అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జోడీగా నటించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన మూవీగా నిలిచింది.

2) ఆర్.ఆర్.ఆర్ :

ఎన్టీఆర్- రాంచరణ్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ మంది వీక్షించారు. ఏకంగా 10 వారాల పాటు ఈ మూవీ ట్రెండింగ్లో నిలిచింది.

3) గంగూబాయి కతియావాడి :

అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీకి మంచి వ్యూయర్ షిప్ నమోదైంది.

4) భూల్ భులయ్యా 2:

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన 4 వ మూవీగా నిలిచింది.

5) బీస్ట్ :

విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో ప్లాప్ అయ్యింది కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన 5 వ మూవీగా నిలిచింది.

6) డార్లింగ్స్ :

అలియా భట్ నటించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన 6 వ మూవీగా నిలిచింది.

7) బదాయ్ దో :

రాజ్ కుమార్ రావు, భూమి పెడ్నేకర్ నటించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన 7 వ మూవీగా నిలిచింది.

8) 83 :

రణ్ వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవిత కథతో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూసిన ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఈ మూవీ టాప్ 8 ప్లేస్ ను దక్కించుకుంది.

9) శ్యామ్ సింగ రాయ్ :

నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన ఈ మూవీ థియేటర్లలో బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేసి టాప్ 9 ప్లేస్ ను దక్కించుకుంది.

10) జాదూగర్ :

జితేంద్ర కుమార్, ఆరుషి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేసిన సినిమాల్లో టాప్ 10 ప్లేస్ ను దక్కించుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus