Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Mana ShankaraVaraprasad Garu

బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ మెగా మూవీ, తాజాగా బుల్లితెరపై కూడా అదే రేంజ్‌లో రికార్డుల మోత మోగించింది.ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ జీ తెలుగులో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయ్యింది.

థియేటర్లలో మిస్ అయిన వాళ్లతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా టీవీల ముందు కూర్చోవడంతో ఈ మూవీ టీఆర్పీ (TRP) రేటింగ్స్‌లో దుమ్ములేపింది. తాజాగా విడుదలైన రేటింగ్స్ ప్రకారం ఈ సినిమా ఏకంగా 14.2 భారీ టీఆర్పీ సాధించి మెగా మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నయనతార లాంటి స్ట్రాంగ్ స్టార్ కాస్ట్ ఉండటం బుల్లితెర ఆడియన్స్‌ను మరింత ఆకర్షించింది. చిరు మార్క్ ఎనర్జిటిక్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ టేకింగ్ టీవీ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తన ఫ్యామిలీని కాపాడుకునే ఎమోషనల్ పాయింట్‌కు కనెక్ట్ అవ్వడం వల్లే, టీవీలో ఈ రేంజ్ సాలిడ్ రేటింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 దక్కించుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చి కరెక్ట్‌గా నెల రోజులు అవుతున్నా.. వ్యూవర్‌షిప్ పరంగా ఇంకా టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus