టాలీవుడ్‌లో ఊర మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాక్సాఫీస్ దద్దరిల్లేలా యాక్షన్ సీక్వెన్స్ తీయడంలో ఆయన స్టైలే వేరు.
గతేడాది ‘అఖండ 2’తో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోందనే సస్పెన్స్ ఇన్నాళ్లూ కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన హిందీ సినిమా ‘జాట్’ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అనిపించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేని వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ‘జాట్ 2’ కోసం ముందుగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యను అనుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్‌లో ఆయన ఈ స్క్రిప్ట్‌పై వర్క్ కూడా చేశారట.
కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఈ సీక్వెల్ రేసులోకి బోయపాటి శ్రీను పేరు తెరపైకి వచ్చింది. సన్నీ డియోల్‌కు బోయపాటి మార్క్ మాస్ పడితే వర్కౌట్ అవుతుందని భావించిన మైత్రీ సంస్థ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.ప్రస్తుతం బోయపాటి కూడా ఓ స్టార్ హీరో కోసం వెతుకులాటలో ఉన్నారు కాబట్టి, సన్నీ డియోల్ ప్రాజెక్ట్‌ను ఆయన టేకప్ చేసే ఛాన్స్ ఉందని వినికిడి. సన్నీ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు బోయపాటి హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే వెండితెరపై రక్తాభిషేకం గ్యారెంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బాలీవుడ్-టాలీవుడ్ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.