‘ఆదిపురుష్’ తప్పకుండా చూడడానికి గల 13 కారణాలు..!

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ . ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తప్పకుండా చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1 ) ప్రభాస్ మొదటి సారి ఓ మైథలాజికల్ మూవీలో నటించాడు. శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ లుక్స్ బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది. ఈతరానికి రామాయణం గొప్పతనం చెప్పాలి అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో అవసరం. ఈ విషయంలో టీం మొదటి సక్సెస్ సాధించింది అని చెప్పాలి.

2 ) కృతి సనన్ : జానకి(సీతా దేవి) పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు. కృతి సనన్ నటించిన ప్రతి సినిమాలో చక్కని హావభావాలు పలికించింది.ఇలాంటి పాత్రకి ఆమె అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాలి.

3 ) రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వి.ఎఫ్.ఎక్స్ కూడా అద్భుతంగా వచ్చాయని టాక్. ట్రైలర్ లో కూడా ఆ ఇంపాక్ట్ ఉంది.

4 ) ఈ చిత్రానికి అజయ్ – అతుల్ , సాచిత్ పరంపర, సంచిత బల్హారా, అంకిత్ బల్హారా సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుందట.

5 ) సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అంటే రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్రని ఓం చాలా బాగా డిజైన్ చేసినట్లు వినికిడి.

6 ) వానర సైన్యం పోరాటాలు అద్భుతంగా వచ్చాయట. ఆ విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయని తెలుస్తుంది.

7 ) ‘జై శ్రీరామ్’ పాట వినడానికి మాత్రమే కాకుండా విజువల్ గా కూడా చాలా బాగా వచ్చింది.

8 ) త్రీడి లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రామాయణాన్ని ఇప్పటి జెనరేషన్ కు ఓ విజువల్ వండర్ లా త్రీడి ఎఫెక్ట్స్ తో చూపించడం అనేది పెద్ద సాహసం. దాని కోసం కూడా ఆదిపురుష్ ను తప్పకుండా ఓ సారి చూడాలి.

9 ) లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ లుక్స్ బాగున్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో అతను నటన ఇరగదీసాడట.

10 ) ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కూడా నటించింది. ఆమె పాత్రని గోప్యంగా ఉంచారు. సినిమాలో కీలక పాత్ర కావడంతో టీం ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

11 ) రామాయణం ఎన్నో సార్లు వచ్చినప్పటికీ.. ఓం రౌత్ సీన్లు కొత్తగా డిజైన్ చేసి.. ప్రతి సన్నివేశానికి ఒక మోరల్ చెప్పాలనుకుంటున్నట్టు .. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకొచ్చాడు. అది ఏంటి అనేది తెర పై చూడాలి.

12 ) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఎంతో నమ్మకంగా ఈ చిత్రం తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసుకుని.. రిలీజ్ చేస్తుంది. అది కూడా సినిమా చూడాలనే ఆసక్తిని జనాల్లో కలిగించింది అని చెప్పాలి.

13 ) ఆదిపురుష్ (Adipurush) సినిమా ప్రదర్శింపబడే ప్రతి థియేటర్లో హనుమంతుని కోసం ఒక సీటు వదిలేస్తారట. దాన్ని చూడటానికైనా థియేటర్ కు తప్పకుండా వెళ్ళాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus