Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్‌లో ఇటీవల హీరోల పెళ్లిళ్ల వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరిగా యువ హీరోలు తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెబుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Bellamkonda Srinivas

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్, తన డెబ్యూ మూవీ ‘అల్లుడు శీను’తో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘జయ జానకి నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా “రాక్షసుడు” సినిమా ఆయన కెరీర్‌లో ఒక పెద్ద హిట్‌గా నిలిచింది. ఇటీవల బాలీవుడ్‌లో కూడా ‘ఛత్రపతి’ రీమేక్‌తో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డి అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే సమాచారం వినిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని తెలుస్తోంది. ఆమె కుటుంబం న్యాయవాదుల నేపథ్యం కలిగినదిగా సమాచారం.

ఇద్దరూ కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడుతూ పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. మార్చి 8న వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ విషయంపై శ్రీనివాస్ లేదా ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ముందుగానే తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజంగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus