దువ్వాడ జగన్నాథమ్ ని ఎందుకు చూడాలంటే ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం తర్వాత చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాలో అనేక అంశాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో టాప్ టెన్ అంశాలపై ఫోకస్..

స్టోరీ క్యాటరింగ్ చేసుకొనే ఓ బ్రాహ్మణ యువకుడు రియల్ ఎస్టేట్ లో జరిగిన మోసానికి వ్యతిరేకంగా పోరాడడమే డీజే స్టోరీ. ఈ లైన్ ని హరీష్ శంకర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మలిచారని సమాచారం. డీజేకి స్టోరీ ప్రధాన బలం.

డీజే క్యారెక్టర్ దువ్వాడ జగన్నాథంలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ప్రధాన అంశం క్యారెక్టర్. ఇప్పటి వరకూ లవర్ బాయ్, స్టైలిష్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన అల్లు అర్జున్.. డీజే లో తొలిసారి బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అంతేకాదు పూర్తిగా పంచెకట్టులో కనిపించకుండా సూటు బూటులో మెస్మరైజ్ చేస్తున్నాడు. రెండు షేడ్స్ కలిగిన ఈ పాత్ర ప్రధాన ఆకర్షణగా మారింది.

పూజా హెగ్డే ‘డీజే’కు రెండో ఆకర్షణ హీరోయిన్. ఒక లైలాకోసం, ముకుంద సినిమాలకంటే ఇందులో పూజా చాలా హాట్ గా కనిపిస్తోంది. అంతేకాదు బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్ ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచింది.

హరీష్ శంకర్కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో హరీష్ శంకర్ దిట్ట. యువత పల్స్ తెలిసిన ఈయన డీజేలో కామెడీ, లవ్, యాక్షన్ లను సమపాళ్లలో మిక్స్ చేసాడు. ఆయన టేకింగ్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ ని డీవీ శ్రీ ప్రసాద్ ఎప్పుడూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తుంటారు. ఈ సారి కూడా సూపర్ హిట్ ట్యూన్స్ ఇచ్చారు. టైటిల్ సాంగ్ తో పాటు గుడిలో బడిలో మడిలో వడిలో, సీటీ మార్, బాక్స్ బద్దలైపోయే.. పాటలు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

స్టెప్పులు దేవీ అద్భుతమైన పాటలు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఊరికినే ఉంటారా? వాటికి తన స్టెప్పులతో మరింత ఊపు తీసుకొచ్చాడు. గుడిలో బడిలో మడిలో వడిలో.. స్టైల్ గా స్టెప్పులు వేస్తే.. సీటీ మార్ పాటలో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు.

ఫైట్స్ సరైనోడు తో అల్లు అర్జున్ పూర్తి మాస్ హీరోగా ఎదిగిపోయాడు. అతని నుంచి మరింత యాక్షన్ ఊహిస్తారు. వారి అంచనాలకు మించి ఇందులో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

పంచ్ డైలాగ్స్ హరీష్ శంకర్ సినిమా అనగానే పంచ్ డైలాగ్స్ ఫుల్ గా అంటాయి. ఇందులోనూ చాలా ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. “మనం చేసే పనిలో మంచి కనబడాలి కానీ, మనిషి కనపడక్కర్లేదు”, “పబ్బుల్లో వాయించే డీజే కాదురా.. పగిలిపోయేలా వాయించే డీజేని”, “ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి” అంటూ శాంపిల్స్ చూపించాడు.

కామెడీ అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. ఆ టైమింగ్ ని హరీష్ శంకర్ చక్కగా వాడుకున్నట్లు టీజర్, ట్రయల్ స్పష్టం చేసింది. ఓ వైపు యాక్షన్, మరో వైపు కామెడీ.. ఆడియన్స్ కి ఫుల్ మీల్స్.

బ్రాండ్ దిల్ రాజు సినిమా అంటేనే దానిపై ఫుల్ క్రేజ్ ఉంటుంది. అంతలా తన బ్రాండ్ వాల్యూ పెంచుకున్న దిల్ రాజు తన బ్యానర్ లో 25 వ సినిమాగా డీజే ను నిర్మించారు. హీరో, హీరోయిన్, డైరక్టర్, పాటలు, ఫైట్స్ తో పాటు నిర్మాత కూడా డీజే కి ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ఇన్ని అంశాలు కలగలిసిన దువ్వాడ జగన్నాథం .. అల్లు అర్జున్ కి మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus