పాటల్లో అమ్మ ప్రేమ

  • August 27, 2016 / 11:50 AM IST

అమ్మ. అమృతం లాంటి పదం. తొలి గురువు.. తొలి స్నేహితురాలు అమ్మే. చిరునవ్వు, దిగులు ఆమె. ఇలా కన్నతల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయితే అమ్మ గొప్పతనాన్నితెలుగు సినిమాల్లో పాటల ద్వారా ఎంతో ప్రేమగా తెలిపారు. అవి వింటుంటే ఎవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం. మనసులో ముద్ర పడిపోయిన ఆ పాటల గురించి..

పాండురంగ మహత్యం

https://www.youtube.com/watch?v=gmOXs4YXDdw

“అమ్మా అని అరచిన ఆలకించవేవమ్మా.. ఆ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా ..” అని పాండురంగ మహత్యంలో విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పాడుతుంటే.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లిని క్షమాపన కోరే ఈ గీతం .. ఇప్పటి వారినికూడా కదిలుస్తుంది.
అదే కథతో నట సింహ బాలకృష్ణ పాండురంగడు సినిమాలో నటించారు. ఇందులో బాలకృష్ణ తమ తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటాడు. “మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను .. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా” అని ఈ సాగే పాట గుండెలను పిండేస్తుంది. “మరచి పోయి కూడా మన్నిచొద్దమ్మా” అనే వాఖ్యం మదిని కలత పెడుతుంది.

20 వ శతాబ్దం

https://www.youtube.com/watch?v=kiFdKkqjYWU

సుమన్ హీరోగా నటించిన 20 వ శతాబ్దం సినిమాలో అమ్మ గొప్పదనాన్ని ఒక్క పాటలో నింపారు. “అమ్మను మించి దైవం ఉన్నదా .. ఆత్మను మించిన అద్దం ఉన్నదా .. జగమే పలికే శాశ్వత సత్య మిదే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే .. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే ” అంటూ సాగే పాట ఎప్పటికీ నిలిచిపోతుంది.

అమ్మ రాజీనామా

అమ్మ రాజీనామా సినిమాలో “సృష్టికర్త ఒక బ్రహ్మ .. అతనిని సృష్టించినది ఒక అమ్మ” అనే పాట దర్శక రత్న పాడుతూ ఉంటే తల్లుల కంట కన్నీరు ఆగలేదు. “తల్లి చాటు బిడ్డ ముద్దు.. బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నా తల్లే అడ్డు అడ్డు” అంటూ కన్నతల్లులను సరిగా చూసుకోని బిడ్డలకు బుద్ధి చెప్పేలా ఈ పాట సాగుతుంది.

యమలీల

ఆలీ హీరోగా పరిచయమైనా “యమలీల” సినిమాలో ” సిరులు వలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలుచీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి అడుగుల తప్పటడుగులే కరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనదాన్యాలు ” అంటూ సాగే పాట కొడుకు మంచి ప్రయోజికుడు కావాలని తల్లి పాడుకునే పాట తల్లుల హృదయాలకు అడ్డం పడుతుంది.

సిసింద్రీ

“చిట్టి తండ్రీ నిను చూడగా.. వెయ్యి కళ్ళైనా సరిపోవురా.. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అందుకే అమ్మ వడిలోనే దాగుండి పోరా” అని సిసింద్రీ సినిమాలో తన బంగారు బాబు పై తల్లి ప్రేమను కురిపిస్తుంది.

నాని

https://www.youtube.com/watch?v=PB4Es309huU

సూపర్ స్టార్ మహేష్ బాబు నాని సినిమాలో ” పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగు అమ్మ” అంటూ చంద్రబోస్ రాసిన పాట నేటి యువతకు బాగా నచ్చింది. చాల మంది దీనిని రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం, ఉన్ని కృష్ణన్, సాధన సర్గమ్ గొంతుల్లోని మాధుర్యం ఈ పాటకు మరింత తీయదనాన్ని అద్దింది.

చత్రపతి

https://www.youtube.com/watch?v=ve4YXWSW410

బిడ్డను బాధ పెడితే తల్లి ఎలా విలపిస్తుందో ఒక పాట ద్వారా చూపించారు ఎస్ ఎస్ రాజమౌళి. చత్రపతి సినిమాలో “నల్లని వన్నినీళ్లని .. తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలి పోతున్నా, నేను చేసిన తప్పు చెరిగిపోయేనా” అంటూ తల్లి బిడ్డను ఓదార్చుతుంది. ఈ పాట కూడా తెలుగు వారి మనసుని హత్తుకుంది.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

https://www.youtube.com/watch?v=ET30vfL_iBI

“నీవే నీవే నీవంట.. నీవు లేక నేనే లేనంటా” అనే పాట చక్రి అద్భుతంగా పాడి .. నేటి తరం అమ్మల గొప్పతనం తెలిపాడు. యువత ఈ పాటకి జోహార్లు పలికారు.

లోఫర్

అమ్మ చూట్టూ తిరిగే “లోఫర్” సినిమాలో జాతీయ అవార్డ్ అందుకున్నరచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన
“సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేది అమ్మ .” పాట గుండె పొరల్లో దాగున్న చెమ్మను వెలికి తీస్తుంది. దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా.. అనే ఈ వాఖ్యం ద్వారా సుద్దాల ప్రతి బిడ్డ కోరికను చెప్పాడు.

మనం

“కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా .. నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా.. ఒకరిది కన్ను, ఒకరిది చూపు ” అంటూ సాగే పాట “మనం” సినిమాకే హైలెట్. కన్నతల్లిదండ్రులు కళ్లముందు కనిపిస్తే, వారికి సేవ చేసే అదృష్టం వస్తే ఎంత ఆనందం వేస్తుందో ఈ పాటలో వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus