10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘గబ్బర్ సింగ్’కి ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. ‘దబాంగ్’ కి రీమేక్ గా రూపొందినప్పటికీ.. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు.. చాలా మార్పులు చేసి హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

10 Years For  Sardaar Gabbar Singh

వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కంబ్యాక్ అందించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరసింది ఈ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘సర్దార్ గబ్బర్ సింగ్'(Sardaar Gabbar Singh) పై కూడా ఆ రేంజ్లో హైప్ ఉండేది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సీక్వెల్ మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత అతను తప్పుకోవడం.. అతని ప్లేస్ లో బాబీకి దర్శకుడిగా ఎంపికవ్వడం చక చకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజులు అవి. అందువల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. తర్వాత షూటింగ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. మొత్తానికి 2016 ఏప్రిల్ 8న ఈ సినిమాని రిలీజ్ చేశారు.

ఉగాది పండుగ రోజునాడు సెలవు ఉండటంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. అయితే మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో 2వ రోజుకి కలెక్షన్స్ తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) కలెక్షన్స్ ను అదిగమించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’ రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏకంగా రూ.22 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డు కొట్టింది.

అప్పుడున్న హైప్ కి కనుక సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉంటే.. ఫుల్ రన్లో చాలా రికార్డులు బ్రేక్ చేసేది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. అయితే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది. పాటలు అన్నీ చాలా బాగుంటాయి.

సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus