Rajamouli: పవన్ – మహేష్ ల మల్టీస్టారర్ విషయంలో కూడా రాజమౌళి మనసు మార్చుకుంటాడా..!

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రాజమౌళికి అలవాటు. ‘మగధీర’ తో మొదటి రూ.100 కోట్ల సినిమాని అందించాడు, ‘బాహుబలి’ (సిరీస్) తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు. ఇద్దరు స్టార్ హీరోలతో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాన్ని రూపొందించి .. అందులో ‘నాటు నాటు’ అనే పాటకి ఆస్కార్ రప్పించాడు. ‘ఇన్ని చేసిన రాజమౌళి .. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు లతో ఓ మల్టీస్టారర్ చేయలేడా?’ ఇది జనాల మనసులో బలంగా నాటుకుపోయిన ప్రశ్న.

టాలీవుడ్లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా.. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ లకి ఉన్న ఇమేజ్ వేరు. వీళ్ళ అభిమానుల మధ్య ఎంత మాటల యుద్ధం జరిగినా.. ఈ ఇద్దరు హీరోల సినిమాలను ఎగబడి చూస్తుంటారు. పవన్ – మహేష్ ల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. సో వీళ్ళ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రావాలనేది అందరి కోరిక.గతంలో కొంతమంది దర్శకులు కొన్ని ఐడియాస్ అనుకున్నారు. తర్వాత వర్కౌట్ అవ్వదు అని వదిలేసారు.

ఇదే విషయం పై రాజమౌళి (Rajamouli) అయితే 13 ఏళ్ళ క్రితమే క్లారిటీ ఇచ్చేసాడు. ఓ నెటిజెన్ ఈ విషయం పై రాజమౌళిని ప్రశ్నించగా.. ‘మహేష్, పవన్ కాంబినేషన్ లో మూవీ అనేది ఒక కల. ఈ కాంబినేషన్లో సినిమా కోరుకోవడం టూ మచ్..” అంటూ అతనికి రిప్లై ఇచ్చాడు రాజమౌళి. అంటే ఆ కాంబోలో మూవీ తీయడం అనేది నా వల్ల కాదు అని రాజమౌళి చెప్పినట్టే..! కాకపోతే అప్పటికీ ఇప్పటికీ రాజమౌళి ఆలోచనలు చాలా మారాయి.

‘మగధీర’ తర్వాత బిగ్ బడ్జెట్ సినిమాలు చేయను అన్నాడు. కానీ ‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా కూడా బిగ్ బడ్జెట్ మూవీనే..! కాబట్టి.. విజయేంద్ర ప్రసాద్ కనుక.. ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే.. రాజమౌళి ఫిక్స్ అవ్వడం ఎంత సేపు..!

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus