13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే
- September 27, 2026 / 02:01 PM ISTByPhani Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ‘జల్సా’ వంటి సూపర్ హిట్ తర్వాత ‘అత్తారింటికి దారేది'(Atharintiki Daaredi) అనే ఫ్యామిలీ మూవీ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ కోసం చాలా కష్టపడింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో బాగా థియేటర్లు బంద్ అయిన టైమ్లో పెద్ద సినిమాలు రిలీజ్..లు ఆగిపోయాయి. అందుకే 2013 ఆగస్టు 9న రిలీజ్ అవ్వాల్సిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా వాయిదా పడింది.
Atharintiki Daaredi

అయితే సెప్టెంబర్ 24న అనుకోకుండా ఈ సినిమా ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. అది కూడా హైక్వాలిటీ ప్రింట్. దీంతో హడావిడి హడావిడిగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2013 సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సినిమాపై హైప్ అయితే ఉంది. కానీ అప్పటికే ప్రింట్ లీక్ అయిపోవడంతో.. ట్రేడ్లో ఈ సినిమా ధియేట్రికల్ రన్ పై చాలా అనుమానాలు నెలకొన్నాయి.అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ జనాలు ఈ సినిమాని థియేటర్లలో బ్రహ్మరధం పట్టారు.
సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఈ సినిమాని చూసేందుకు ఎగబడ్డారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న నేపధ్యంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి:
| నైజాం | 23.25 cr |
| సీడెడ్ | 10.46 cr |
| ఉత్తరాంధ్ర | 6.22 cr |
| ఈస్ట్ | 4.07 cr |
| వెస్ట్ | 3.38 cr |
| గుంటూరు | 5.25 cr |
| కృష్ణా | 3.72 cr |
| నెల్లూరు | 2.63 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 58.98 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.11 cr |
| ఓవర్సీస్ | 8.90 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 74.99 cr |
‘అత్తారింటికి దారేది’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.51 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.74.99 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి రూ. 23 కోట్ల వరకు లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
‘ప్యారడైజ్’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!















