ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

ద్విపాత్రాభినయం.. త్రిపాత్రాభినయం.. ఇవే కష్టం అనుకుంటున్న సమయంలో ఓ సినిమాలో ఏకంగా పది పాత్రలు పోషించి వావ్‌ అనిపించారు ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌. ఆయన చేసిన ప్రయోగం ఇటు పైసలు, అటు ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందు తొమ్మిది పాత్రలు చేసిన హీరోలు (శివాజీ గణేశన్‌, ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌ ) కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఓ కమెడియన్‌ ఈ ప్రయత్నం చేశారు. తన కొత్త సినిమాలో ఏకంగా 16 పాత్రలు పోషించారట.

Yogi Babu

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఇప్పుడు ‘మూన్ వాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన 16 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మాట ఆయన దగ్గర అడిగితే అన్ని పాత్రలు చేస్తున్నాను కానీ.. ‘దశావతారం’ లాంటి సినిమా కాదు అని క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో 16 పాత్రల్లో నటించడానికి తొలుత డైరెక్టర్‌కు నో చెప్పాను. కానీ నేను చేస్తే బాగుంటుందని ఆయన పట్టుబట్టి మరీ చేయించారు అని చెప్పారు యోగిబాబు.

‘మూన్ వాక్’ సినిమాలో మూవీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న విష్యం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో దుబాయ్ మాథ్యూ, కవారిమాన్ నారాయణన్, ఆట్టుక్కాల్ తదితర పాత్రల్లో యోగిబాబు కనిపిస్తారట.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ చిన్న పట్టణంలో కొంతమంది యువకులు.. పాప్ సింగర్లు, మైఖేల్ జాక్సన్‌ను చూసి వారి స్ఫూర్తితో డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటూరు. ఈ క్రమంలో ఏం జరిగింది, వారి ఆశ నెరవేరిందా, దాని కోసం ఏం చేశారు అనేదే సినిమా కథ అని సమాచారం. మరి ఈ సినిమాలో యోగిబాబు ఇన్ని పాత్రలు ఎందుకు వేశారో ఈ సమ్మర్‌లో సినిమా వచ్చినప్పుడు తెలుస్తుంది.

నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus