గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొత్త కథలు ఏమీ ఉండట్లేదు. ఉండాలనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాల్లో వరల్డ్ బిల్డింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. దానికి తగ్గట్టు హీరో ఎలివేషన్స్ పడాలి. అంతే.. అవి ఉంటే చాలు మిగతా సంగతి ప్రేక్షకులు చూసుకుంటారు. అది కాదని.. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను కనుక రీమేక్ చేసి సేఫ్ గేమ్ ఆడేద్దాం అనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో.. ఇటీవల వచ్చిన చాలా రీమేక్ సినిమాలు చాటి చెప్పాయి.

17 Years For Souryam

అందులో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ఒకటని చెప్పాలి. 2 ఏళ్ళ క్రితం అంటే 2023 ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలమ్’ సినిమాకి ఇది రీమేక్ అని చెప్పాలి. ఆ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ ‘భోళా శంకర్’ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. చెల్లెలి ఫ్యామిలీని నాశనం చేసిన విలన్ అండ్ గ్యాంగ్ పై హీరో రివెంజ్ తీర్చుకునే కాన్సెప్ట్ మూవీ ఇది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుంది.

వాస్తవానికి ఇలాంటి కాన్సెప్ట్ తోనే గోపీచంద్ సినిమా కూడా ఒకటి వచ్చింది. అదే ‘శౌర్యం’. 2008 సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ కూడా అంతే. కలకత్తా బ్యాక్ డ్రాప్లోనే సాగుతుంది. చెల్లెల్ని విలన్ గ్యాంగ్ నుండి కాపాడుకోవడానికి ఓ అన్న పడే ఆరాటం.. చేసే పోరాటమే ‘శౌర్యం’ కథాంశం అని చెప్పాలి. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

గోపీచంద్ కి ఆ టైంలో మంచి మాస్ ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ కి తగ్గట్టు మాస్ అండ్ కామెడీని మిక్స్ చేసి ఎమోషన్ ని కూడా సమాంతరంగా పండించారు. సినిమాటోగ్రాఫర్ శివ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత అతను తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే ‘భోళా శంకర్’ ఒరిజినల్ అయినటువంటి ‘వేదాలమ్’ కి కూడా శివనే దర్శకుడు.

మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus