‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.!
డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి… మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అలా అని ఎక్కడా డ్రాప్ అయ్యింది లేదు. 2 వారాల పాటు డీసెంట్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ 15వ రోజున ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.56 cr |
సీడెడ్ | 0.86 cr |
ఉత్తరాంధ్ర | 0.89 cr |
ఈస్ట్ | 0.58 cr |
వెస్ట్ | 0.32 cr |
గుంటూరు | 0.41 cr |
కృష్ణా | 0.35 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.18 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.71cr |
ఓవర్సీస్ | 1.53 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.23 cr (షేర్) |
’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.10.42 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మూడో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’ మినహా.. పేరున్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. అది ’18 పేజెస్’ కి కొంత కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!