Nikhil: కార్తికేయ హిట్… ఆ పండుగను టార్గెట్ చేసిన 18 పేజెస్?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో నిఖిల్ తన తదుపరిచిత్రం 18 పేజెస్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

సూర్య ప్రతాప్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో సుకుమార్, గీత ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కార్తికేయ 2 తర్వాత మరోసారి ఈ జంట 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఇక ఈ షెడ్యూల్ త్వరగా పూర్తిచేసుకుని వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధమైనట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగను టార్గెట్ చేసి ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ద్వారా కూడా నిఖిల్ ప్రేక్షకులను సందడి చేస్తారా? లేకపోతే ప్రేక్షకులను నిరాశ పరుస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus