‘తండేల్’ (Thandel) సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఓ విషయం అయితే కచ్చితంగా ప్రస్తావనకు వస్తోంది. అదే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది అని. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే గీతా ఆర్ట్స్ కాస్త ఎక్కువే పెట్టింది. సినిమా రిజల్ట్ అందుకే చాలా కీలకం అని చెబుతున్నారు. ఆ ఎక్స్‌ట్రా బడ్జెట్ కారణాల్లో ఒక దాని గురించి తెలిసిందే. ఓ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారట.
నాగచైతన్య (Naga Chaitanya) – సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ అంశం నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది.
ఫిబ్రవరి 7న సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు చందు మొండేటి ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుననారు. ఈ క్రమంలో ఓ సీక్వెన్స్ కోసం చెప్పారు. దాని గురించి చెబుతూ రూ.18 కోట్లు అయింది అని చెప్పారు. సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్ మీద అవగాహన కోసం డి.మత్స్యలేశం వెళ్లామని, అప్పుడు అక్కడి జనాలు సముద్రంలో చోటుచేసుకున్న తుపాను, ఆ సమయంలో మత్య్సకారుల సమయస్ఫూర్తి గురించి చెప్పారని తెలిపారు.
ఆ సీన్‌ను సినిమాలో పెడదామనుకున్నామని, అయితే అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా, అలాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని నిర్మాతల్ని ఒప్పించి తీశామని చెప్పారు. ఆ ఎపిసోడ్‌కే రూ.18 కోట్లు బడ్జెట్ అయిందని చెప్పారు. ఆ సీన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. యాడ్ ఆన్ సీన్స్‌గా తెరకెక్కించిన ఆ సీన్స్ క్లిక్ అయితే బాక్సాఫీసు దగ్గర రాజులమ్మ జాతరే అని చెప్పొచ్చు. తేడా కొడితే నిర్మాతకు జాతరే. చూద్దాం ఏమవుతుందో?