బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 లో ఎలిమినేషన్ ఘట్టం మొదలైంది. మొదటివారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. కొంతమంది అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యిందని , మరికొంతమంది ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయ్యిందని పోస్ట్ లు పెట్టారు. కానీ, బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవర్నీ చేయలేదని సమాచారం.
అంతేకాదు, అభినయశ్రీని లాస్ట్ వరకూ తెచ్చి టెన్షన్ పెట్టినట్లుగా చెప్తున్నారు. ఇంకొంక అవకాశం వస్తే అభినయశ్రీ తానేంటో ప్రూవ్ చేస్కుంటుందని, అలాగే, ఇనయ సుల్తానా కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోందని బిగ్ బాస్ ఈ ప్లాన్ చేసిందా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదని తెలిసిన దగ్గర్నుంచీ బిగ్ బాస్ లవర్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే బిగ్ బాస్ టీమ్ గ్లామర్ కోసం ఇనయా సుల్తానాని కాపాడారని, అందుకే ఎలిమినేషన్ చేయలేదని అంటున్నారు.
నిజానికి ఈ వారం నామినేషన్స్ బుధవారం వరకూ జరిగాయి. కేవలం రెండు రోజులు మాత్రమే ఓటింగ్ అనేది జరిగింది. గురువారం, శుక్రవారం ఓటింగ్ ఆధారంగా ఎలిమినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదని బిగ్ బాస్ టీమ్ ఆలోచించి ఉండచ్చు. అందుకే, మొదటివారం బిగ్ బాస్ టీమ్ కావాలనే ఇలా చేశారని చెప్తున్నారు.
మరోవైపు బిగ్ బాస్ టీమ్ 21మంది హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ హౌస్ లో మేనేజ్ చేయలేకపోతున్నారు. రెండో వారం తప్పకుండా డబుల్ ఎలిమినేషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈసారి పార్టిసిపెంట్స్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. మొదటి రెండు వారాలు పార్టిసిపెంట్స్ కి చాలా విలువైనవి. మరి ఈవారం నామినేషన్స్ లోకి రాకుండా ఎవరు ఉంటారు అనేది చూడాలి.