ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’
- November 21, 2026 / 12:01 PM ISTByPhani Kumar
విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధియేటర్లో కంటే కూడా ఓటీటీలో, రీ రిలీజ్లో ఎక్కువ అప్రీషియేషన్ పొందింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ ఏ సినిమా ఈవెంట్లో కనిపించినా.. ‘ ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ఎప్పుడు?’ అంటూ అరుపులు వినిపించడం మనం చూశాం. వారందరి కోరికని గమనించి.. మొత్తానికి ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యాడు తరుణ్ భాస్కర్.
ENE Repeat

‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో ఈ సీక్వెల్ రెడీ అయ్యింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన సుజన్ యరబోలు ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ను నిర్మించారు. క్రేజీ సీక్వెల్ కావడంతో మొదటి నుండీ ట్రేడ్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్ళు బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.85 cr |
| సీడెడ్ | 0.20 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.80 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 2.85 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.38 cr |
| ఓవర్సీస్ | 2.1 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 5.33 cr (షేర్) |
‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.5.33 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా పరంగా రూ.11 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.15.67 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.













