సర్కారు వారి పాట.. రెండు భారీ ఈవెంట్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగానే ఆలోచిస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి సినిమా విడుదలైన కూడా ముందుగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కోసం మాత్రం ఒకటి కాదు విడుదలకు ముందు రెండు భారీ ఈవెంట్స్ నిర్వహించాలని ఆలోచించినట్లు గా తెలుస్తోంది. ఇటీవల ఆచార్య సినిమాకు విడుదలకు ముందు అంతగా హైప్ లేకపోవడంతో ఓపెనింగ్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి. అందుకే సర్కారు వారి పాట ఆ విషయం లో రిస్క్ తీసుకోకుండా ఉండాలి అని ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించాలని డిసైడయ్యారు. ఇక ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మరొక మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇది ప్రత్యేకంగా థమన్ కోసమే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఆ భారీ వేడుకకు కూడా కొంత మంది సెలబ్రిటీలు రాబోతున్నట్టు సమాచారం. ఇక సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సముద్రకని పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పై దర్శకుడు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్థాయిని ఈ సినిమా మరో స్థాయికి తీసుకు వెళుతుంది అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus