హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇప్పుడు ఓ ఫిలింసిటీ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలింసిటీగా దానికి పేరు కూడా ఉంది. అయితే హైదరాబాద్‌ పరిసరాల్లో మరో ఫిలింసిటీ కట్టాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులేసింది. గత ప్రభుత్వం హయాంలో దీని మీద సీరియస్‌గా ప్రయత్నాలు జరిగినా పని అవ్వలేదు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు అగ్ర హీరోలకు భూములు ఇచ్చి ఫిలిం సిటీ నిర్మించమని డీల్‌ కుదుర్చుకోనున్నారని సమాచారం.

Salman and Ajay Devgn

హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ స్టూడియోలు ఉన్నా.. అందులో రామోజీ ఫిలింసిటీ ఒకటే పెద్దది. ముంబయి లాంటి సినిమా ఫ్లేవర్‌ నగరంలో చాలా ఫిలింసిటీలు ఉన్నాయి. అందుకే తెలంగాణలో ఎక్కువ ఫిలింసిటీలు ఉండాలని అనుకుంటూ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఈ క్రమంలో తెలుగు హీరోలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయని టాక్‌. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు బాలీవుడ్‌ హీరోల వైపు ప్లానింగ్‌ మళ్లింది. అలా హిందీ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌లను రంగంలోకి దింపారని టాక్‌.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. అక్కడికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి, హైదరాబాద్‌‌కు అనుబంధంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫిలింసిటీల సంగతి కూడా తేలనుంది అని చెబుతున్నారు. దీనికి సంబంధించి సల్మాన్‌ ఖాన్‌ను ఇప్పటికే భూముల కేటాయింపు నిర్ణయం జరిగిందట. అజయ్‌ దేవగణ్‌కి కూడా అలానే చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి ముంబయి వెళ్లి సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌ను కలిశారు. అప్పుడు ఏదో కారణం చెప్పినా.. అసలు కారణం ఇదీ అని అంటున్నారు.

‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus