స్టార్ హీరోల ఇళ్లకు కూడా సెక్యూరిటీ సరిపోవడం లేదా.!

  • March 3, 2023 / 05:23 PM IST

సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీల ఇళ్లకు కూడా సెఫ్టీ ఉండటం లేదు. మొన్నామధ్య నటి హిమజ ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ సిసి కెమెరాలు ఉండటం వల్ల ఆ దొంగలు దొరికేశారు. కానీ ఆ దొంగల పై ఆమె కేసు వంటిది పెట్టలేదు. కాస్త క్లాస్ పీకి వదిలేసింది. దీనికంటే ముందు మోహన్ బాబు ఇంట్లోకి కొంతమంది దుండగులు కారులో వచ్చి చంపేస్తాం, నరికేస్తాం అంటూ బెదిరించారు. ఈ సంఘటనలు జనాలను షాక్ కు గురి చేశాయి.

ఇవే బీభత్సం అనుకుంటే ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో ఇంట్లో దొంగలు పడడం.. ఇంకా షాకిచ్చిందనే చెప్పాలి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్. అవును.. మీరు చదువుతున్నది నిజమే..! ముంబైలో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నివాసంలోకి ఇద్దరు దొంగలు అక్రమంగా చొరబడ్డారు. గురువారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సెక్యూరిటీ అప్రమత్తం అవ్వడంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో వాళ్ళు గుజరాత్ కు చెందిన వ్యక్తులు అని తేలింది. ‘మా అభిమాన హీరో అయిన షారుఖ్ ఖాన్ ను దగ్గర్నుంచి చూడాలనిపించి ఇలా ఇంట్లోకి వెళ్ళామని.. అంతకు మించి మాకు దొంగతనానికి పాల్పడే ఉద్దేశం లేదని’ వారు పోలీసులకు చెప్పారు. అయితే వారి బయోడేటా మొత్తం తెలుసుకుని..

వారిపై ఇదివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే వారి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిజంగా గతంలో వారిపై ఎటువంటి కేసులు నమోదు కాకపోతే కొంత జరిమానా విధించి.. కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయస్థానం విడిచిపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus