HIT 4: హిట్ 4 కోసం ఇద్దరు హీరోలా?

నాచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT) క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ మూడో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి హైప్‌తో రూ.100 కోట్ల మార్క్‌ను దిశగా దూసుకెళ్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి  (Srinidhi Shetty)  శెట్టి నానికి జోడీగా నటించిన ఈ సినిమా, డార్క్ వెబ్ సైకోలను వేటాడే కథతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో ‘హిట్ 2’ (HIT 2) హీరో అడివి శేష్ (Adivi Sesh)  ఎంట్రీ ఇచ్చి, నానితో కలిసి ఫైట్ చేసే సీన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

HIT 4

అంతేకాదు, సినిమా ఎండింగ్‌లో ‘హిట్ 4’ (HIT 4) కేస్‌లో కార్తి ఎంట్రీతో ఫోర్త్ పార్ట్‌కు భారీ అంచనాలు మొదలయ్యాయి. ‘హిట్ 3’ క్లైమాక్స్‌లో అడివి శేష్‌ను రంగంలోకి దించిన శైలేష్ కొలను, ‘హిట్’ ఫస్ట్ పార్ట్ హీరో విశ్వక్‌సేన్‌ను (Vishwak Sen) మాత్రం ఎందుకు చూపించలేదనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ‘హిట్’ సిరీస్‌లో తొలి చిత్రంతో మాస్‌కా దాస్ విశ్వక్‌సేన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అడివి శేష్‌ను తీసుకొచ్చినప్పుడు విశ్వక్‌ను కూడా చూపించి ఉంటే బాగుండేదని అతని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే, ‘హిట్ 4’ కోసం విశ్వక్‌ను హోల్డ్‌లో పెట్టారని, ఒకే సినిమాలో నాని, అడివి శేష్, విశ్వక్‌లను చూపిస్తే ఆ ఎఫెక్ట్ తగ్గుతుందని శైలేష్ భావించాడని ఇన్‌సైడ్ టాక్. ‘హిట్ 4’లో (HIT 4) కార్తితో (Karthi) విశ్వక్‌ను రంగంలోకి దింపే ప్లాన్‌లో ఉన్నాడని అంటున్నారు. ‘హిట్ 4’ కథ లారీ మట్టిలో కప్పిపెట్టిన శవం నేపథ్యంలో సాగనుందని, ఆ హత్యను కార్తి ఎలా ఛేదిస్తాడు, దాని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో కథనం నడుస్తుందని సమాచారం.

విశ్వక్‌సేన్‌ను ‘హిట్ 4’లో తీసుకురావడం ద్వారా కార్తితో కలిపి మరో సర్‌ప్రైజ్ ఇవ్వాలని శైలేష్ కొలను భావిస్తున్నాడని అంటున్నారు. ఈ ప్లాన్ నిజమైతే ‘హిట్ 4’ సిరీస్‌లో మరో హైలైట్ అవుతుంది. ‘హిట్ 3’లో నాని, అడివి శేష్ కాంబినేషన్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న విధంగా, ‘హిట్ 4’లో కార్తి, విశ్వక్ జోడీ కూడా అలరిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘హిట్ 3’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాని నటన, శైలేష్ కొలను డైరెక్షన్, అనిరుధ్ రవిచందర్ సంగీతంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ‘హిట్ 4’లో కార్తి, విశ్వక్‌ల కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలంటే 2026 వరకు వేచి చూడాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus