తమిళనాడులో గీత గోవిందం 20 రోజుల కలక్షన్స్

  • September 6, 2018 / 07:31 AM IST

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఆగస్టు 15 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ రాబట్టగా మూడు రోజుల్లో 37.45 కోట్ల గ్రాస్ అందుకొని ఔరా అనిపించుకుంది. ఇరవై రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 109 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ జోరు ప్రదర్శించడం విశేషం. అక్కడ మూడు రోజుల్లోనే 1.79 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం 20 రోజులకు 6కోట్ల గ్రాస్ ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డు ను క్రియేట్ చేసింది.

బాహుబలి చిత్రం తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రంగా గీత గోవిందం నిలిచింది. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేసింది. ఈ చిత్రం తో వారు భారీ లాభాలను అందుకున్నారు. ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండడంతో మరో పది రోజులపాటు గీత గోవిందం హావ కొనసాగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ గిరాకీ ఉంటుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికే అవకాశముందని చెబుతున్నారు. అందుకే విజయ్ దేవరకొండ నోటా అనే ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇది హిట్ అయితే కమలహాసన్, రజినీకాంత్, సూర్య మాదిరిగా రెండు భాషల్లోనూ విజయ్ దూసుకుపోనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus