Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » 20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

  • April 29, 2026 / 12:26 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

టాలీవుడ్లో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డుల వేట కోసమే కాకుండా, ఒక నటుడి ఇమేజ్‌ని పూర్తిగా మార్చేయడానికి కూడా పుడతాయి అని చెప్పాలి. అలాంటి సినిమాల్లో ‘పోకిరి'(Pokiri) ఒకటి.

20 Years For Pokiri

సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది.ఈ సినిమాకు ముందు మహేష్ బాబు ఒక మంచి నటుడు మరియు ‘ప్రిన్స్’, స్టార్ హీరో అనే ట్యాగ్ కూడా పొందాడు. కానీ ‘పోకిరి’ తర్వాత మహేష్ నెంబర్ వన్ హీరో రేసులోకి దూసుకెళ్ళాడు.

‘పోకిరి’ చిత్రానికి ముందు మహేష్ బాబుకు యూత్,ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది.’అతడు’ కూడా మహేష్ ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అతనికి ఓవర్సీస్ మార్కెట్ తెచ్చిపెట్టింది. కానీ, థియేటర్ల దగ్గర మాస్ జాతర ఎలా ఉంటుందో మహేష్ కి కానీ అతని అభిమానులకి కానీ రుచిచూపించింది మాత్రం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ అనే యాక్షన్ డ్రామానే. ఈ సినిమాతో మహేష్ బాబు ఒక కంప్లీట్ మాస్ హీరోగా అవతరించాడు.

మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే ‘ ‘పోకిరి’ ముందు – ‘పోకిరి’ తర్వాత’ అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు.అలాంటి ‘పోకిరి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

2002 లో వచ్చిన హాంకాంగ్ సినిమా ‘ఇంటర్నల్ అఫైర్స్’ ఆధారంగా పూరీ ఒక లైన్ అనుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుస్తుం’ ‘స్టేట్ రౌడీ’ సినిమాల స్పూర్తితో ఆ లైన్ ని డెవలప్ చేసుకున్నాడు. దానికి ‘ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య నారాయణ’ అనే పేరు పెట్టాడు.పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ రిజెక్ట్ చేశాడు. రవితేజతో సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. నాగబాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు.

2 రోజులు షూటింగ్ తర్వాత ఈ ప్రాజెక్టుని ఆపేశారు. అందుకు కారణాలు ఏంటి అన్నది బయటకి రాలేదు.ఓ దశలో ఈ కథని సోనూ సూద్ తో కూడా  తీయాలని అనుకున్నాడు పూరీ. అయితే ఒకానొక టైమ్లో పూరీ.. మంజులని కలిసి కథ వినిపించడం.. ఆమె మహేష్ వద్దకు పూరీని పంపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ‘నాని’ ఫ్లాప్ అవ్వడంతో భవిష్యత్తులో మంజుల బ్యానర్లో ఓ సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చాడు.

ఆ డేట్స్ ని పూరీ ప్రాజెక్టుకి అలోకేట్ చేయించింది మంజుల. టైటిల్ తో పాటు స్క్రిప్టుల్లో కొన్ని మార్పులు కోరి ‘పోకిరి’ గా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు మహేష్ బాబు. ‘అతడు’ కి ‘సైనికుడు’ సినిమాలకి మధ్య దొరికిన గ్యాప్లో ‘పోకిరి’ సినిమా చేసేశాడు మహేష్.

‘పోకిరి’ కోసం మహేష్ 45 రోజులు డేట్స్ ఇచ్చాడు. సీన్ ఎంత బాగా వచ్చినా.. వన్ మోర్ టేక్ అడిగి మరీ చేయించుకోవడం మహేష్ బాబుకి అలవాటు. కానీ ‘పోకిరి’ విషయంలో దర్శకుడు పూరీపై పూర్తిగా నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళాడు.

ఒకేసారి 2,3 ప్రదేశాల్లో 2,3 సీన్లు షూట్ చేసిన ఘనత పూరీ సొంతం అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదట కంగనా రనౌత్, ఆయేషా టాకియా(‘సూపర్’ ఫేమ్) వంటి బాలీవుడ్ భామలను హీరోయిన్లుగా అనుకున్నారు పూరీ. కానీ తర్వాత ‘దేవదాస్’ తో సూపర్ హిట్ అందుకున్న ఇలియానాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

అలాగే తండ్రి పాత్ర కోసం పూరీ… అమితాబ్ ను సంప్రదించారు. కానీ ఫైనల్ గా నాజర్ ను తీసుకున్నారు. దాంతో బడ్జెట్ కంట్రోల్ పెట్టినట్టు అయ్యింది.

66 రోజుల్లో ‘పోకిరి’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. 2006 జనవరిలో మొదలుపెడితే మార్చి ఎండింగ్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 28 కి రిలీజ్ చేసేశారు.

బెనిఫిట్ షోలు వంటివి ‘పోకిరి’ కి పడలేదు. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మొదటి వారం సొ సొ వసూళ్లే సాధించింది. కానీ రెండో వారంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘బంగారం’ డిజాస్టర్ అవ్వడంతో ‘పోకిరి’ వసూళ్లు పెరుగుతూనే వచ్చాయి.

మహేష్ బాబుని అప్పటి వరకు ఇంత మాస్ గా ప్రేక్షకులు చూసింది లేదు. అది ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయ్యింది అని చెప్పాలి.

సౌత్ లో రూ.40 కోట్ల షేర్ ను రాబట్టిన మొట్ట మొదటి తెలుగు సినిమాగా ‘పోకిరి’ చరిత్ర సృష్టించింది. 2009 జూలై నెలలో వచ్చిన ‘మగధీర’ వరకు ‘పోకిరి’ వసూళ్లను మించిన సినిమా రాలేదనే చెప్పాలి.

మహేష్ బాబుని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘పోకిరి’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రీ రిలీజ్ లో కూడా ‘పోకిరి’ భారీ వసూళ్లు రాబట్టింది. ఒక రకంగా రీ- రిలీజ్ ట్రెండ్ ను బలోపేతం చేసింది కూడా ‘పోకిరి’ అనే చెప్పాలి. 20 ఏళ్ళైనా ‘పోకిరి’ మేనియా తగ్గలేదు అనే చెప్పాలి.

సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #20 years for pokiri
  • #Mahesh Babu
  • #Pokiri

Also Read

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

35 mins ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

2 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

6 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 hour ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

3 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

5 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version