2017 కి టాటా చెప్పనున్న సినిమాలివే!

తెలుగు చిత్ర పరిశ్రమకి 2017 మంచి అనుభూతులను మిగిల్చింది. సక్సస్ రేట్ ఎక్కువగా సాధించి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి ఆనందాన్ని పంచింది. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ఖైదీ నంబర్ 150 నుంచి దీపావళికి విడుదలయిన రవితేజ ది గ్రేట్ వరకు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక సినీ పరిశ్రమకు ఈ ఏడాదిలో మిగిలిన సీజన్ క్రిస్మస్ ఒక్కటే. దీంతో ఈ ఏడాదికి బై బై చెప్పినట్లే. ఈ సీజన్ కంటే ముందు అక్టోబర్‌ 27న రామ్‌ “ఉన్నది ఒక్కటే జిందగీ” చిత్రం విడుదలవుతుంది. “నేను శైలజ” చిత్రం హిట్‌ తర్వాత రామ్, డైరెక్టర్ కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాపై అంచనాలు బాగున్నాయి.

ఇక క్రిస్‌మస్‌ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 21న నాని నటిస్తున్న “ఎం.సి.ఎ- మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి” చిత్రం థియేటర్లోకి రానుంది. అఖిల్‌ అక్కినేని నటించిన “హలో” డిసెంబర్‌ 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ తో హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరన విడుదలయ్యే చిత్రంగా  గోపిచంద్‌ నటించిన “ఆక్సిజన్‌” రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29 న థియేటర్లో సందడి చేయనుంది. మరి ఇవి విజయంతో 2017 కి టాటా చెబుతాయో, లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus