చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ ఫిక్స్.. కానీ?

2023 సంక్రాంతి పండుగ కానుకగా ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కానున్నాయని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు కాగా వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు థియేటర్లను కేటాయించడం సులువైన విషయం కాదు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుందని దాదాపుగా ఫిక్స్ అయింది.

మొదట బాలయ్య తన సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని అనుకున్నా ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గకూడదని ఆయన భావిస్తున్నారని ఈ పోటీలో అసలు ట్విస్ట్ ఇదేనని బోగట్టా. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య107 సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే తెరకెక్కుతుండటంతో ఈ సినిమాల మధ్య పోటీ ఉండదని అందరూ భావించగా బాలయ్య నిర్ణయం వల్ల మైత్రీ నిర్మాతలు సైతం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా కొన్నిరోజుల గ్యాప్ లో రిలీజ్ కావడం అంటే ఒక విధంగా సంచలనం అనే చెప్పాలి. చిరంజీవి మాత్రం సంక్రాంతికి బాలయ్యతో పోటీ పడటం వల్ల రెండు సినిమాలకు నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలు మాస్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలే కావడం గమనార్హం. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా కావడంతో బాలయ్య107 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం వల్ల కూడా బాలయ్య107 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్ మలినేని సినిమాతో బాలయ్య 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus