2025లో అయినా ఈ టాలీవుడ్ బ్యూటీల జాతకం మారుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. అయితే టాలీవుడ్ లోనే కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న కొంతమంది హీరోయిన్ల చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. కొంతమంది చేతిలో ఆఫర్లు ఉన్నా ఆ ఆఫర్లు మరీ భారీ ఆఫర్లు కాకపోవడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు సక్సెస్ రేట్ తగ్గడం కూడా కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. కృతిశెట్టి (Krithi Shetty) , శ్రీలీల (Sreeleela) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) , పూజా హెగ్డే (Pooja Hegde) తమ ప్రతిభతో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లు కాగా స్టార్ హీరోలకు జోడీగా ఈ హీరోయిన్లకు మూవీ ఆఫర్లు అయితే రావడం లేదనే చెప్పాలి. పాన్ ఇండియా ట్రెండ్ ఈ హీరోయిన్లకు (Beauties) శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Beauties

నిర్మాతలు సైతం బాలీవుడ్ హీరోయిన్లకు లేదా కొత్త హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్31 సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరును పరిశీలిస్తున్నారని నాని (Nani) తర్వాత ప్రాజెక్ట్ లో కేజీఎఫ్ (KGF) బ్యూటీ శ్రీనిధి శెట్టికి (Srinidhi Shetty) ఛాన్స్ దక్కిందని నాని మరో మూవీలో జాన్వీ (Janhvi Kapoor)  నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబో మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) జక్కన్న (S. S. Rajamouli) కాంబో మూవీకి హాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ హీరోయిన్లకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లకు 2025లో అయినా ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తాయా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

రవితేజ కోసం రాసిన కథతో హిట్ సాధించిన తారక్.. ఏ మూవీ అంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus