రవితేజ కోసం రాసిన కథతో హిట్ సాధించిన తారక్.. ఏ మూవీ అంటే?

మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja)  ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. అయితే రవితేజ మిస్ చేసుకున్న కథలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారట. తారక్ సినీ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో టెంపర్ (Temper) సినిమా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Jr NTR , Ravi Teja

అయితే వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ సినిమా కథను రవితేజను దృష్టిలో ఉంచుకుని రాశారట. అయితే రవితేజకు టెంపర్ సినిమా కథ కనెక్ట్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడానికి ఈ సినిమానే కరెక్ట్ అని భావించి టెంపర్ మూవీలో నటించడానికి ఓకే చెప్పారు. రవితేజ కోసం రాసిన కథతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారని చెప్పాలి.

రవితేజ, తారక్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. రవితేజ తారక్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నా ఈ కాంబోలో సినిమా రావడం సులువైన విషయం అయితే కాదని చెప్పవచ్చు. తారక్ ప్రస్తుతం దేవర (Devara) సినిమా సక్సెస్ ఇచ్చిన సంతోషంలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.

వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

హీరోయిన్ సమంత ఫోన్ ట్యాపింగ్.. సింగర్ చిన్మయి రియాక్షన్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus