Weekend Releases: ఈవారం థియేటర్/ ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో దసరా, దీపావళి సందడి ముగిసిపోయింది.. ఓ మోస్తరు సినిమాలు క్రిస్మస్‌కి, బిగ్ స్టార్స్ భారీ చిత్రాలు సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నాయి. రిషబ్ శెట్టి ‘కాంతార’ మూడో వారంలోనూ కలెక్షన్లు కొల్లగొడుతోంది.. నవంబర్ ఫస్ట్ వీక్‌లో దాదాపు అరడజను కొత్త బొమ్మలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నాయి. ఏంటా సినిమాలు, సిరీసులు.. ఇప్పుడు చూద్దాం..

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్, మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ జంటగా.. రాకేష్ శశి దర్శకత్వంలో.. అల్లు అరవింద్ సమర్పణలో.. విజయ్, ధీరజ్ మొగిలినేని నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఊర్వశివో రాక్షసివో’.. ఈ మూవీ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి.. హీరో హీరోయిన్లుగా.. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’.. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది..

యంగ్ యాక్టర్ నందు, స్టార్ యాంకర్ రష్మి జంటగా.. రాజ్ విరాట్ దర్శకత్వం వహించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ లో రఘు కుంచె, కిరీటి తదితరులు నటించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే వస్తోంది.

జైద్ ఖాన్, సోనాల్ హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన మిస్టీరియస్ లవ్ స్టోరీ.. ‘బనారస్’.. జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రోమోస్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 4న రిలీజ్ కానుంది..

‘దండుపాళ్యం’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి ‘తగ్గేదే లే’ అంటూ వస్తోంది.. నవీన్ చంద్ర, ‘బొమ్మాళి’ రవి శంకర్, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా , పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించగా.. ‘దండపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస రాజు డైరెక్ట్ చేసిన ‘తగ్గేదే లే’ కూడా నవంబర్ 4నే విడుదలవుతోంది..

మత్స్య కారుల జీవన ప్రయాణం ఆధారంగా.. నందిత శ్వేత, మన్యం కృష్ణ మెయిన్ లీడ్స్‌గా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెట్టి’ నవంబర్ 4న రిలీజ్ అవనుంది..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సర్వైవల్ థ్రిల్లర్ ‘మిలి’ తో ఆడియన్స్ ముందుకొస్తుంది.. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ‘హెలెన్’ మూవీకి రీమేక్‌గా రూపొందిన ‘మిలి’ కి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ముత్తుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 4న థియేటర్లలోకి వస్తోంది..

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ..

నెట్‌ఫ్లిక్స్

ఇన్ సైడ్య మ్యాన్ (హాలీవుడ్) – అక్టోబర్ 31

ది ఘోస్ట్ – నవంబర్ 2

కిల్లర్ సాలీ – నవంబర్ 2

ఎనోలా హోల్మెస్ (హాలీవుడ్) – నవంబర్ 4

మేనిఫెస్ట్ సీజన్- 4 (వెబ్ సిరీస్) – నవంబర్ 4

లుకిసిమ్ – నవంబర్ 4

దావిద్ (మూవీ) – నవంబర్ 4

బుల్లెట్ ట్రైన్ (హాలీవుడ్) – నవంబర్ 4

హాట్‌స్టార్

బ్రహ్మాస్త్ర (బాలీవుడ్) – నవంబర్ 4

అమెజాన్ ప్రైమ్

పొన్నియిన్ సెల్వన్:1 – నవంబర్ 4

మై పోలీస్ మ్యాన్ – నవంబర్ 4

ఆహా

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ఎపిసోడ్ 3 – నవంబర్ 4

పెట్టకాలి – నవంబర్ 4

సోనిలివ్

కాయుమ్ కలవుమ్ – నవంబర్ 4

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus