మరీ బాహుబలి రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ లేకపోయినా కనీస స్థాయిలో ఆడినా చాలు అనుకోని హిందీలోనూ “సైరా”ను విడుదల చేశారు. ఇదివరకు “కె.జి.ఎఫ్” హిందీ వెర్షన్ తో మంచి లాభాలు చూరగొన్న ఫర్హాన్ అక్తర్ “సైరా” హిందీ రైట్స్ కొన్నాడు. తొలి రోజు ఆశించిన స్థాయి వసూళ్లు రాకపోయినా.. లాంగ్ రన్ లో తాను పెట్టిన మొత్తం తిరిగి వస్తుంది అనుకొన్నాడు. కానీ.. ఆదేరోజు విడుదలైన మరో బాలీవుడ్ చిత్రం “వార్” ముందు “సైరా” నిలవలేకపోయింది. నిజానికి వార్ కి వచ్చిన రివ్యూలకి, ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న మొత్తానికి అస్సలు సంబంధం లేదు. కేవలం.. యాక్షన్ సీక్వెన్స్ లు మరియు హృతిక్, టైగర్ ల చరిష్మా పుణ్యమా అని 300 కోట్లు వసూలు చేయడానికి చేరువలో ఉంది.
వారం తర్వాత కూడా కనీస స్థాయి కలెక్షన్స్ లేకపోవడంతో.. సైరా హిందీ వెర్షన్ ను థియేటర్ల నుండి తొలగించారు. దాంతో హిందీ వెర్షన్ సైరా కలెక్షన్స్ 8 కోట్ల రూపాయలతో ముగిసింది. సినిమాను 25 కోట్లకు కొని, 5 కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం వెచ్చించారు. ఈ లెక్కల ప్రకారం సినిమాకి దాదాపు 22 కోట్ల రూపాయల నష్టం వచ్చిందనే అనుకోవాలి. చిరంజీవి 90ల కాలంలో మెగాస్టార్ గా బాలీవుడ్ కు కూడా పరిచయం ఉన్నప్పటికీ.. ఈమధ్యకాలంలో ఆయన సినిమాలేమీ బాలీవుడ్ లో విడుదలవ్వలేదు. దాంతో ప్రెజంట్ జనరేషన్ బాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ ఎవరో తెలియదు. ఆ కారణంగానే.. మీడియం రేంజ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. “సైరా” సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ లేకుండా బాలీవుడ్ లో లాస్ ప్రొజెక్ట్ గా మిగిలిపోయింది. ఇకపోతే.. తెలంగాణలో దసరా సెలవులను ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ఎక్స్ టెండ్ చేయడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!