‘అన్‌స్టాపబుల్‌ 2’లో కొత్త ఎపిసోడ్‌ భలే పవర్‌ఫుల్‌!

  • November 17, 2022 / 02:02 PM IST

‘అన్‌స్టాపబుల్‌’ అంటూ తొలి సీజన్‌లో సినిమా ముచ్చట్లు, సినిమా వాళ్ల ముచ్చట్లను చూపించి వావ్‌ అనిపించారు నందమూరి బాలకృష్ణ. బాలయ్యలోని కొత్త యాంగిల్‌ను చూసి అభిమానులు అయితే ఫుల్‌ మీల్స్‌ విత్‌ ఐస్‌క్రీమ్‌ తిన్నంత ఖుషీ అయిపోయారు. మరి అలాంటి షోకి సీక్వెల్ వస్తున్నప్పుడు ఎలా ఉండాలి.. అనుకున్నదానికంటే రెట్టింపు ఉండాలి లేకపోతే… అంచనాలను అందుకోవడం కష్టం. ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్‌’ + ఆహా టీమ్‌ అదే పనిలో ఉంది. ఈ క్రమంలో పొలిటీషియన్స్‌ను కూడా తీసుకొస్తోంది.

‘అన్‌స్టాపబుల్‌ 2’ని చంద్రబాబు నాయుడుతో స్టార్ట్‌ చేసి.. ఈ హింట్‌ ఇచ్చేశారు. అయితే ఆ తర్వాత కుర్ర హీరోలతో ఎపిసోడ్‌లు వచ్చాయి. కానీ ఎపిసోడ్‌ 5కి వచ్చేసరికి మళ్లీ పొలిటీషియన్స్‌ వైపు వచ్చేశారు. అయితే తొలి పొలిటీషియన్‌ బంధువు అయితే, ఈ పొలిటీషియన్స్‌ స్నేహితులు కావడం గమనార్హం. ఐదో ఎపిసోడ్‌లో ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే ఫొటోలతో చెప్పేసింది టీమ్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కే.ఆర్‌.సురేశ్‌ రెడ్డి వస్తున్నారని చెప్పారు.

కానీ ఈ ఎపిసోడ్‌కి వచ్చేది ఇద్దరు కాదు, ముగ్గురు అని సమాచారం. దీనికి సంబంధించిన మరో ఫొటోను టీమ్‌ షేర్‌ చేసింది. ఆ మూడో గెస్ట్‌ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయిన రాధిక. బాలయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సురేశ్‌ రెడ్డితో రాధిక దిగిన సెల్ఫీని టీమ్‌ ట్వీట్‌ చేసింది. ‘‘ఎపిసోడ్‌ షూట్‌ పూర్తయింది. వచ్చే ఎపిసోడ్‌ పవర్‌, పాలిటిక్స్‌, పాత మెమొరీస్‌ కలిపి ఉండబోతోంది.. సిద్ధంగా ఉండండి’’ అంటూ ఆ ఫొటోతో రాసుకొచ్చింది ఓటీటీ టీమ్‌.

మామూలుగా ఒక్క బాలయ్య ఉంటేనే సందడి. అందులోనూ తన స్నేహితులను కలిస్తే ఇంకా సందడి చేస్తారు. లేడీ పవర్‌ హౌస్‌ రాధిక వీరికి యాడ్‌ అయ్యారు అంటే.. ఇక ఆ హుషారు, జోరు మామూలుగా ఉండదు. ఆ లెక్కన నెక్స్ట్‌ఎపిసోడ్ అంతకుమించి అనేలా ఉంటుందేమో.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus