ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తారా?
- June 26, 2026 / 02:00 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాలను రెగ్యులర్ సినిమాలతో పోల్చలేం అని చెబుతుంటారు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన కొన్ని చర్చించాల్సిన అంశాలను ఆయన తన సినిమాల ద్వారా కమర్షియల్ టచ్ ఇచ్చి మరీ డిస్కస్ చేయిస్తారు. అలా ఆయన చేసిన ఓ సినిమా ‘3 ఇడియట్స్’. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళ – తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ ‘నన్బన్’ / ‘స్నేహితుడు’ అనే పేరుతో తెరకెక్కించారు. ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడు అసలు విషయమైన సీక్వెల్ గురించి చూద్దాం.
3 idiots
‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ త్వరలో స్టార్ట్ చేస్తారు అని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ అండ్ టీమ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమా కథపై, పాత్రల విషయంలో చాలా రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిని రాజ్ కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ‘3 ఇడియట్స్’ సినిమా సీక్వెల్ డ్రాఫ్ట్‌పై పనిచేస్తున్నాం. అది ప్రాథమిక దశలో ఉందని చెప్పేశారు.

ఆమిర్ ఖాన్ కథ విని నచ్చిందన్నారని చెప్పిన రాజ్ కుమార్ హిరానీ. అభిజిత్ జోషి, తాను స్క్రిప్ట్ రాస్తున్నామని చెప్పారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారనే విషయాన్ని మరో రెండు నెలల్లో చెబుతామని తెలిపారు. తొలి పార్టులో ఉన్న పాత్రలే ఈ సీక్వెల్‌లో ఉంటాయని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత వాళ్లేం చేస్తున్నారు అనేదే రెండో పార్టు కథ అని చెప్పారు. కాలేజీ రోజులు ముగిశాక ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు, పెళ్లి – పిల్లల గురించి ఈ పార్టులో చెబుతామని క్లారిటీ ఇచ్చారు.
అయితే, మరి తొలి పార్టును సినిమాగా తీసి ఆశించిన ఫలితం అందుకోలేని శంకర్ ఈ సినిమా సీక్వెల్‌ను టచ్ చేస్తారని అనుకోలేం. ఆమిర్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు.












