సెప్టెంబర్ విజేత ప్రభాస్.. ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం సాధ్యమేనా?

  • August 14, 2023 / 02:17 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. పెద్ద సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో విడుదలైతే ఒక సినిమా ఎఫెక్ట్ మరో సినిమాపై పడుతోంది. సెప్టెంబర్ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండగా ఈ సినిమాలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ నెలలో ప్రతి వారం ఒక పెద్ద సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

సెప్టెంబర్ నెల మొదటివారంలో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషి సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని శివ నిర్వాణ ఈ సినిమాతో మ్యాజిక్ ను రిపీట్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివ నిర్వాణ గత సినిమా టక్ జగదీష్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమా సక్సెస్ విజయ్, సమంత, శివ నిర్వాణలకు కీలకం కాగా మైత్రీ నిర్మాతలు సైతం ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సెప్టెంబర్ రెండో వారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ కానుండగా నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన స్కంద మూవీ రిలీజ్ కానుండగా రామ్ బోయపాటి కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల చివరి వారంలో (Salaar) సలార్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

ప్రభాస్ ఈ సినిమాతో 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ ట్రైలర్ ఈ నెల చివరి వారంలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ విన్నర్ ప్రభాసేనని సినిమాలు రిలీజ్ కాకుండా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus