ఎన్టీఆర్ కాకుండా… త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు…!

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ … తన తరువాతి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చెయ్యడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ల పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఇప్పుడు ప్లానింగ్ అంతా మారిపోయింది. ఇంకా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు.

అది పూర్తవ్వాలి అంటే మరో సంవత్సరం సమయం పడుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎన్టీఆర్ తో పూర్తయ్యాక బన్నీ తో త్రివిక్రమ్ మళ్ళీ ఓ సినిమా చేస్తాడు అని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు బన్నీ కూడా రెండు పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. కాబట్టి బన్నీ వర్కౌట్ అయ్యే ప్రసక్తి లేదు. కానీ త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యాలని మరో ముగ్గురు స్టార్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఆ ముగ్గురు మరెవరో కాదు… చిరంజీవి, వెంకటేష్ , పవన్ కళ్యాణ్.

6 నెలల్లో పూర్తయ్యే స్క్రిప్ట్ ఉంటే చిరు … త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అన్నారని వినికిడి. ఇక పవన్ కూడా తన పొలిటికల్ ఇమేజ్ కు తగిన కథ ఉంటే చూడమని… త్రివిక్రమ్ తో చెప్పాడట. అయితే త్రివిక్రమ్ కు మాత్రం వెంకటేష్ తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఆశ పడుతున్నట్టు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి త్రివిక్రమ్ ఫైనల్ డెసిషన్ ఏంటనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus