Bigg Boss 7 Telugu: 4వ వారం నామినేషన్స్ లో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్..! జరిగిన తప్పులు ఇవే!

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం నామినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా అయ్యాయి.. వాద ప్రతివాదనలు వినిపించుకోమని బిగ్ బాస్ జ్యూరీ మెంబర్స్ ని పెట్టాడు. ఆల్రెడీ పవర్ అస్త్రాని సాధించిన సందీప్, శివాజీ ఇంకా శోభాశెట్టి ముగ్గురూ కలిసి ఏకాభిప్రాయంతో హౌస్ మేట్స్ లో ఒకరిని పిలిచి వారితో ఇద్దరిని నామినేట్ చేయించి పాయింట్స్ వినాలి. ఎవరు పాియంట్స్ వాలిడ్ గా ఉంటాయో వారిని నామినేట్ చేయాలి. ఇక్కడే ఒక్కసారి నామినేట్ అయిన వాళ్లు మరోసారి నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా పటాపంచలు అయ్యాయి. ఇందులో మనం 10 పాయింట్స్ నోటీస్ చేసినట్లయితే..

నెంబర్ – 1

ప్రిన్స్ యావార్ ప్రియాంకని ఎలాంటి పాయింట్స్ అడగాలో ఖచ్చితంగా అడిగాడు. మంచి లాజిక్స్ వర్కౌట్ చేశాడు. ముందు నన్ను వినదు అంటది కదా.. అసలు తనే వినదు అనే పాయింట్ చెప్పాడు. ఇక్కడ ప్రియాంక తనని తాను డిపెండ్ చేస్కోవాలని అనుకున్నది కానీ వర్కౌట్ అవ్వలేదు. జ్యూరీ మెంబర్స్ కూడా ప్రియాంకని నామినేట్ చేసి ఓకే అన్నారు. టేస్టీతేజ బతికిపోయాడు.

నెంబర్ – 2

శుభశ్రీ ఎక్సలెంట్ గా రతికని లాక్ చేసింది. గతవారం బ్లైండ్ గా అమర్ ని ఫాలో అయ్యి నన్ను గౌతమ్ ని నామినేట్ చేస్తావా… నాగ్ సర్ ముందు ఈవిషయం చెప్తావా అంటూ నిలదీసింది. అలాగే, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విషయాలు అస్తమానం ఇక్కడ ఎందుకు డిస్కషన్ పెట్టాలి? బయట సెలబ్రిటీల విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు అనేది బిగ్ బాస్ రూల్ అంటూ లా పాయంట్స్ లాగింది లాయర్ శుభశ్రీ. రతిక ఈ పాయింట్స్ ని కవర్ చేస్కోవాలని చూసింది కానీ అతకలేదు. అంతేకాదు, శుభశ్రీని తన క్యారెక్టర్ గురించి మాట్లాడింది. నేను ప్రియాంకతో చెప్తే అది తెచ్చి ఇక్కడ పెడతావా ఇక్కడే నీ క్యారెక్టర్ తెలుస్తోంది అని చెప్పింది. వీళ్ల వాగ్వివాదం పర్సనల్ గా కూడా చాలా దూరం వెళ్లింది. ఇక శుభశ్రీ నాగ్ సర్ చెప్పిన పాయింట్స్ పైన అమర్ ని కూడా నామినేట్ చేసింది. దీంతో అమర్ కూడా చాలాసేపు సుబ్బుతో వాదించాడు. చివరకి జ్యూరీ మెంబర్స్ ఇద్దరి ఫోటోలు పెడితే, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరో ఒకరినే నామినేట్ చేయమని చెప్పాడు. ఇక ముగ్గురూ కలిసి రతికని నామినేట్ చేశారు.

నెంబర్ – 3

రతిక శివాజీ నాగ్ సర్ ముందు అన్నమాటలని పదే పదే చెప్తూ ఇరిటేట్ చేసింది. ప్రశాంత్ విషయంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎందుకు అన్నారని నిలదీసింది. నేను అక్కడ ఎక్స్ టెన్షన్ చేయడం ఇష్టం లేక నీ మంచికోసమే కట్ చేశానని చెప్పాడు. నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అని కూడా శివాజీ చెప్పాడు. అయినా కూడా ఇదే టాపిక్ లాగుతుంటే అసహనంగా కూడా మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజానికి ఫస్ట్ నుంచీ రతిక పల్లవి ప్రశాంత్ ని కొన్ని విషయాల్లో కవ్వించింది. ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోతానని తెగ ఫీల్ అవుతోంది.

నెంబర్ – 4

గౌతమ్ ప్రిన్స్ ని నామినేట్ చేయడం. ఇక్కడ గౌతమ్ చెప్పే పాయింట్ కరెక్ట్ కానీ, చెప్పిన పద్దతి సరిగా లేదు. నీ ఎగ్రెషన్ అనేది కరెక్ట్ గా లేదని అన్నాడు. అలా అయితే గత వారం రతికని ఇంకా అమర్ ని నామినేట్ ఎందుకు చేశాడు. ఇప్పుడే కావాలని గౌతమ్ ప్రిన్స్ పైన పాయింట్స్ తెచ్చుకున్నాడు. ఇక ప్రిన్స్ రెచ్చిపోయాడు ఇద్దరికీ వాగ్వివాదం పీక్స్ లోకి వెళ్లింది. దీంతో జ్యూరీ మెంబర్స్ మాట కూడా ప్రిన్స్ వినలేదు. ఈ కోపంతో వాళ్లు నామినేట్ చేస్తే బిగ్ బాస్ గడ్డిపెట్టాడు. మళ్లీ వాదనలు విని ప్రిన్స్ నే నామినేట్ చేశారు జ్యూరీ మెంబర్స్.

నెంబర్ 5

జ్యూరీ మెంబర్స్ తో గౌతమ్ రెచ్చిపోయి ఆర్గ్యూ చేశాడు. ముఖ్యంగా శివాజీని పాయింట్ చేశాడు. అసలు నువ్వెవరు అంటూ నిలదీసి మాట్లాడాడు. తన వాలిడ్ పాయింట్స్ ని పెట్టిన కూడా కన్సిడర్ చేయలేదని రెచ్చిపోయాడు. ఇక్కడ శివాజీ చిన్నగా మాట్లాడుతునే హౌస్ మేట్స్ కి చురకలు అంటిస్తున్నాడు.

నెంబర్ – 6

శివాజీ గోడమీద పిల్లిలాగానే మిగతా హౌస్ మేట్స్ ని హర్ట్ చేయకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, నామినేషన్స్ తర్వాత వాళ్లతో ప్యాచ్ అప్ లు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఆడియన్స్ లో మంచి అనిపించుకోవాలనే ప్రయత్నం లాగానే అనిపిస్తోంది.

నెంబర్ – 7

రెండుసార్లు టేస్టీ తేజ బచాయించిపోయాడు. సరైన రీజన్ లేదు. ఫిజికల్ టాస్క్ లో ఆడాలి అని నాగార్జున చెప్పిన పాియంట్స్ నే తిప్పి తిప్పి చెప్పారు హౌస్ మేట్స్.

నెంబర్ – 8

ఆల్ మోస్ట్ శనివారం ఏ పాయింట్స్ పైన క్లాస్ పడిందో అవే పాయింట్స్ తిప్పి తిప్పి చెప్పారు హౌస్ మేట్స్. ముఖ్యంగా అమర్ – ప్రియాంక ఇష్యూ, రతిక నామినేషన్స్ ఇష్యూ, తేజ టాస్క్ గురించి, గౌతమ్ షో ఆఫ్ గురించి ఇలా చాలా విషయాల్లో నాగ్ సర్ పాయింట్స్ కీలకం అయ్యాయి.

నెంబర్ – 9

పల్లవి ప్రశాంత్ కి అమర్ కి చాలా గట్టిగా పడింది. కావాలనే అమర్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి మరీ నామినేషన్స్ లోకి లాగాడు. అలాగే, తనని నామినేట్ చేసిందని శుభశ్రీని సైతం తీస్కుని వచ్చాడు. కానీ, జ్యూరీ మెంబర్స్ శుభశ్రీని నామినేట్ చేసి హౌస్ కి షాక్ ఇచ్చారు.

నెంబర్ – 10

పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ అమర్ గౌతమ్ ఇద్దరినీ తీస్కుని వచ్చాడు. అమర్ ని అయితే బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇచ్చాడు అయినా కూడా జుట్టు శాక్రిఫైజ్ చేయలేదు సరిగ్గా వినియోగించుకోలేదు అని చెప్పాడు. అలాగే, గౌతమ్ ని పాయింట్ అవుట్ చేస్తూ శోభాకి షర్ట్ విప్పి షోఆఫ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. దీంతో బాగా ఆలోచించిన జ్యూరీ సభ్యులు గౌతమ్ ని నామినేట్ చేశారు. దీంతో గౌతమ్ కి తిక్కరేగింది. తన షర్ట్ విప్పి చాలాసేపు అక్కడే అందర్నీ నీకేమైనా ప్రాబ్లమా అంటూ డైలాగ్స్ వేశాడు. జ్యూరీ మెంబర్స్ ఇలా చాలా మిస్టేక్స్ అయితే చేశారు. మరి దీనిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus