బిగ్ బాస్ 4: నామినేషన్స్ లో 5 హైలెట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం కూడా ఓపెన్ నామినేషన్స్ జరిగాయి. ఈసారి అందరూ టాస్క్ పెడతారు అనుకున్నారు. కానీ ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారు. హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే, అరియానా ఇంకోవైపు ఉండిపోయింది. హౌస్ లో అందరూ అరియానాని నామినేట్ చేశారు. అంతేకాదు, ఈసారి పంచదార బాటిల్స్ నెత్తిపైన పగలగొట్టి మరీ చేశారు. దీంతో అరియానా నెత్తిపైన మొత్తం 7బాటిల్స్ పగిలాయి. ఈ నామినేషన్స్ లో మనం ఒక ఐదు పాయింట్స్ నోటీస్ చేసినట్లయితే..,

1. అరియానాని హౌస్ లో మొత్తం 7గురు నామినేట్ చేశారు. అలాగే, మెహబూబ్ ని 3గురు నామినేట్ చేశారు. మిగతా వాళ్లని కేవలం ఇద్దరు మాత్రమే నామినేట్ చేశారు. ఈసారి అరియానాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతేకాదు, తన కెప్టెన్సీ గురించి, పల్లెకి పోదాం టాస్క్ లో తన పెర్ఫామెన్స్ గురించే ఎక్కువమంది నామినేట్ చేశారు.

2. లాస్యని, అఖిల్ ని ఎవరూ నామినేట్ చేయలేదు. అంతేకాదు, ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే అభిజిత్ ని సోహైల్, అఖిల్ ఇద్దరూ కూడా నామినేట్ చేశారు. రీజన్స్ కూడా పెద్దగా ఏమీ చెప్పలేదు. నాగార్జున చెప్పిన టీ స్టాండ్ టాస్క్ గివ్ అప్ గురించే మాట్లాడారు ఇద్దరూ.

3. మెహబూబ్ నామినేట్ చేస్తుంటే, హారిక తనని తాను చాలాబాగా డిపెండ్ చేస్కుంది. అలాగే అరియానాకి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. రెండు మూడు పాయింట్స్ తో అరియానా మాట్లాడుతుంటే, హారిక ఎక్కడా తడబడకుండా చాలా జెన్యూన్ గా వాటిని ఖండించింది. అసలు రీజన్ లేకుండా హారికని ఈసారి అరియానా, మెహబూబ్ లు నామినేట్ చేశారు అనిపించింది.

4. ఈసారి నామినేషన్స్ లో మోనాల్ చాలా వాలిడ్ రీజన్స్ చెప్పింది. అంతేకాదు, తనని నామినేట్ చేసిన వాళ్లకి సరైన రీజన్స్ చెప్తూ తనని తాను బాగా డిపెండ్ చేస్కుంది. ఈసారి మోనాల్ గేమ్ ని సీరియస్ గా తీస్కుంది. 10వ వారం తను ఇండివెడ్యూవల్ గా గేమ్ ఆడేందుకు డిసైడ్ అయ్యింది.

 

5. ఈసారి నామినేషన్స్ లో ఎవరూ కూడా ఎగ్రెసివ్ అవ్వలేదు. కేవలం లాజిక్స్ వర్కౌట్ చేయడానికి, తము చాలా జెన్యూన్ రీజన్ చెప్తున్నాము అని నిరూపించువడం కోసం తాపత్రయ పడ్డారు. ఎప్పుడూ కూడా నామినేషన్స్ అంటే హౌస్ వేడెక్కిపోతుంది. కానీ ఈసారి చాలా కూల్ గానే ముగించేశారు హౌస్ మేట్స్ అందరూ. మరి ఈసారి నామినేట్ అయినవాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus