ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలి, సాహస బాలుడు విచిత్ర కోతి వంటి చిత్రాల్లో బాల నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకొని వినవయ్య రామయ్య చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాగ్ అన్వేష్ ప్రస్తుతం తన రెండో చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడని వినిపిస్తోంది. తన మొదటి చిత్రం వినవయ్యా రామయ్యా తోనే మంచి నటుడిగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసిన నాగ అన్వేష్ ఆ విషయంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడనే ఫిల్మ్ క్రిటిక్స్ చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాగ్ అన్వేష్ ఆ ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండో సినిమా కోసం దాదాపు 50 నుంచి 60 మంది దర్శకుల కథలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే చివరకు ఓ స్టోరీ ఓకే చేసి దాని పై ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నారని సమాచారం. పక్కా ప్లానింగ్ తో ప్రీ పొడక్షన్ వర్క్ అయ్యాకే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు నాగ అన్వేష్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, హీరోయిన్ ఎవరు తదితర విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.