ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’
- November 23, 2026 / 11:55 PM ISTByPhani Kumar
విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధియేటర్లో కంటే కూడా ఓటీటీలో, రీ రిలీజ్లో ఎక్కువ అప్రీషియేషన్ పొందింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ ఏ సినిమా ఈవెంట్లో కనిపించినా.. ‘ ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ఎప్పుడు?’ అంటూ అరుపులు వినిపించడం మనం చూశాం. వారందరి కోరికని గమనించి.. మొత్తానికి ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యాడు తరుణ్ భాస్కర్.
ENE Repeat

‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో ఈ సీక్వెల్ రెడీ అయ్యింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన సుజన్ యరబోలు ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ను నిర్మించారు. క్రేజీ సీక్వెల్ కావడంతో మొదటి నుండీ ట్రేడ్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్ళు బాగానే నమోదయ్యాయి. మొదటి వీకెండ్ ఈ సినిమా బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 6.25 cr |
| సీడెడ్ | 0.53 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.20 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 8.98 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.32 cr |
| ఓవర్సీస్ | 6.47 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 16.77 cr (షేర్) |
‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.16.77 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా పరంగా రూ.33.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.23 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.















