Bigg Boss Telugu 6: నామినేషన్స్ లో రచ్చ మొదలు..! బాలాదిత్య ఫైర్ మాములుగా లేదుగా..!

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. హౌస్ లో ఎవరినైతే నామినేట్ చేయాలో వారిని గార్డెన్ ఏరియాలో ఛైర్ లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అక్కడ బిగ్ బాస్ ఏర్పాటు చేసిన బురద షవర్ లో హౌస్ మేట్స్ స్నానం చేస్తారు. ఈ రకమైన ప్రక్రియ కొత్తదేమీ కాదు, గత సీజన్స్ లో బిగ్ బాస్ ఏర్పాటు చేసిందే. అయితే, ఈసారి నామినేషన్స్ లో మాత్రం హౌస్ మేట్స్ ఒక రేంజ్ లో ఆర్గ్యూ చేసుకున్నారు. లాజిక్స్ వర్కౌట్ చేస్తూనే ఒకరంటే ఒకరు పాయింట్స్ చెప్తూ రెచ్చిపోయారు.

ఈ నామినేషన్స్ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే., ఈసారి నామినేషన్స్ లో గీతు, ఇంకా కెప్టెన్ సూర్య తప్పించి మిగతా అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ ఇంతమంది ఈసారి సీజన్ లో నామినేషన్స్ లో ఉండటం అనేది జరిగింది. ఈ నామినేషన్స్ లో మరోసారి ఇనయకి, ఇంకా శ్రీహాన్ కి టామ్ అండ్ జెర్రీ వార్ స్టార్ట్ అయ్యింది. ఇనయని ఇమిటేట్ చేస్తూ శ్రీహాన్ కౌంటర్స్ వేశాడు.

అలాగే, ఆదిరెడ్డి అర్జున్ ని టీజ్ చేస్తూ నామినేట్ చేయడం హైలెట్ అయ్యింది. ఇక కెప్టెన్ గా నిద్రపోయావ్ అంటూ రేవంత్ ని అందరూ అదే పాయింట్ తో నామినేట్ చేశారు. అలాగే, గీతు బాలాదిత్యని నామినేట్ చేసేటపుడు బాలాదిత్య షాక్ అయ్యాడు. నేను నీకు చెప్పేదేమీ లేదు అంటూ సింగిల్ డైలాగ్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. అలాగే, బురదనీటి స్నానం చేసి వచ్చిన తర్వాత బాలాదిత్య చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ప్రోమోకి హైలెట్ అయ్యాయి.

బాలాదిత్య, రేవంత్ ఈ ఇద్దరికే హౌస్ లో ఎక్కువ ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజ్ , శ్రీహాన్, ఇనయలు కూడా ఓట్లు పడ్డాయి. వాసంతీ ఇంకా ఆదిరెడ్డి ఇద్దరూ కూడా టఫ్ ఫైట్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఫైమా కూడా నామినేషన్స్ లో ఫన్ చేసినట్లుగా సమాచారం. ఇలా ఈసారి నామినేషన్స్ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అలాగే, ఈసారి బాలాదిత్య ఓపెన్ అయి మాట్లాడటం అనేది కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అదీ విషయం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus